NTV Telugu Site icon

Fake TTE: ఎంతకు తెగించార్రా.. ఏకంగా నకిలీ టీటీఈగా వసూళ్లకు పాల్పడిన మహిళా..

Fake Tte

Fake Tte

Fake TTE: శుక్రవారం పాతాళకోట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో నకిలీ మహిళా టీటీఈ పట్టుబడటంతో కలకలం రేగింది. పాతల్‌కోట్ నుంచి చింద్వారా వెళ్లే పాతల్‌ కోట్ ఎక్స్‌ ప్రెస్ ట్రైన్‌ లో వసూళ్లు చేపట్టింది. ఇలా రైలులో ప్రయాణిస్తున్న వారిలో టికెట్లు లేని వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేయడం మొదలు పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే., రైలులో ప్రయాణం చేస్తున్న కొంతమందికి ఆమెపై అనుమానం రావడంతో వెంటనే ఆర్పిఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం బయటికి వచ్చింది.

Test Cricket: ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి 5 వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఓ ప్రయాణికుడు టికెట్ కలెక్టర్ గా వచ్చిన మహిళను తన ఐడి ప్రూఫ్ చూపించమని అడగగా.. ఆమె అందుకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా., అటు ఇటు చూస్తూ మిగతా వారిని టికెట్ ఇవ్వాలంటూ అడుగుతూ ఉంది. దీంతో అక్కడివారు అనుమానం వచ్చి వెంటనే ఆర్పిఎఫ్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు చర్యలు తీసుకున్నారు. ఆ మహిళను ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కి అప్పగించగా.. ఆమె సదరు నకిలీ టీటీఈని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ రైల్వే పోలీస్ స్టేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకోవడానికి నిరాకరించారు. ముందుగా ఆమె ఎందుకు అలా చేసింది..? ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి రైల్వే అధికారులు, పోలీస్ లు విచారణ చేపట్టారు. ఇలా చేయడానికి ఆమెకు ఎవరైనా రైల్వే అధికారులు సహాయం చేశారా..? లాంటి విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనతో ప్రయాణికుల భద్రత కోసం రైలు అధికారులు ఏం చేయాలన్న విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఇక ఈ వైరల్ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి మహిళలు కూడా ఉంటారా..? అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా.. అడ్డదారులలో డబ్బులు సంపాదించడానికి మరొక కొత్త మార్గాన్ని కనిపెట్టారంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Show comments