NTV Telugu Site icon

Cyber Fraud : కాకినాడ కలెక్టర్‌కు కేటుగాళ్లు షాక్‌..

Kritika Shukla

Kritika Shukla

సైబర్‌ నేరగాళ్ల రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ప్రముఖలను టార్గెట్‌గా చేసుకొని వారి పేరుపై నకిలీ సోషల్‌ మీడియా అకౌంట్లను క్రియేట్‌ చేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు కేటుగాళ్లు. అయితే.. ఇప్పటికే పలువురు ప్రముకుల పేర్లపై నకిలీ సోషల్‌మీడియా అకౌంట్లు క్రియేట్‌ చేసి సన్నిహితులకు డబ్బులకు కావాలంటూ మెసేజ్‌లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. అయితే తాజాగా కాకినాడ కలెక్టర్‌ కృతికా శుక్లాను కూడా వదల్లేదు కేటుగాళ్లు. ఆమె పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాలో కలెక్టర్‌ కృతికా శుక్లా ఫోటోను డీపీగా పెట్టి అర్జెంటుగా డబ్బు కావాలని జిల్లా స్థాయి అధికారులకు మెసేజ్‌లు పెట్టారు. చాలా మంది అధికారులకు మెసేజ్‌లు రావడంతో ఆశ్చర్యపోయారు.

 

కొత్త నెంబర్‌ కావడంతో ఉన్నతాధికారులు కలెక్టర్‌ కృతికా శుక్లా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విషయం తెలిసి కలెక్టర్‌ కృతికా శుక్లా ఖంగుతిన్నారు. తాను డబ్బులు అడగమేంటని మెసేజ్‌లను పరిశీలించిన ఆమె.. వెంటనే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే.. మెసేజ్‌లు పంపిన నెంబర్‌ ఉత్తర ప్రదేశ్‌కు చెందినది పోలీసులు గుర్తించారు. కేటుగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.