Fact Check: ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ‘పోర్న్ లెటర్’.. స్పందించిన ప్రభుత్వం
- ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో నకిలీ లేఖ
- వైరల్ అవుతున్న ఈ 'పోర్న్ లెటర్'?
- స్పందించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో నకిలీ లేఖ పంపడంపై కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఈమెయిల్ ద్వారా ప్రజలకు పంపుతున్న లేఖ నకిలీదని తెలిపింది. ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఈ లేఖను పంపుతున్నారు. ఈ ‘పోర్న్ లెటర్’ పంపింది ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో కాదు. ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట ఉన్న ఈ లేఖ ఇంటర్నెట్ ఐపీ ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా కోర్టు ఆర్డర్ గురించి చెబుతుంది. అసభ్యకరమైన విషయాలను చూసేందుకు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని ఇందులో ఆరోపించారు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ నకిలీ లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అధికారిక హ్యాండిల్ ఈ వైరల్ లేఖను ఖండించింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్… ఈ ఇమెయిల్ నకిలీదని ఎక్స్ పోస్ట్ ద్వారా తెలిపింది. మీరు సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను చేయాలనుకుంటే cybercrime.gov.inలో చేయాలని సూచించింది.
READ MORE: Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ఈ లేఖలో ఏం ఉంది?
భారతీయ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రాసిక్యూటర్ ప్రశాంత్ గౌతమ్ నుంచి వచ్చినట్లు క్లెయిమ్ చేస్తూ.. లేఖలో ఇలా రాశారు. “ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డిపార్ట్‌మెంట్ తరపున మీ ఇంటర్నెట్ ఐపీ ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా క్లోజ్డ్ కోర్ట్ ఆర్డర్ గురించి మీకు తెలియజేయడానికి ఈ సమాచారం పంపుతున్నాం. మీరు మీ అధికారిక లేదా ప్రైవేట్ ఇంటర్నెట్‌ను అసభ్యకరమైన విషయాలను చూసేందుకు వేదికగా మార్చుకోవడం చాలా దురదృష్టకరం. మా లేబొరేటరీలు అత్యాధునిక స్పైడర్/క్రాలింగ్ డిజిటల్ సాఫ్ట్‌వేర్, పరికరాలతో అమర్చబడి ఉన్నాయి. ఇవి హార్డ్ డిస్క్‌లు మరియు మొబైల్ ఫోన్‌ల నుంచి తొలగించబడిన డేటాను సంగ్రహించడం, ఇమేజింగ్, హాష్ విలువ లెక్కలు, ఫోరెన్సిక్ సర్వర్లు, ఆన్-సైట్ పరిశోధన కోసం పోర్టబుల్ ఫోరెన్సిక్ సాధనాలు వంటి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఆధునిక ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్‌తో పాటు చైనీస్ ఫోన్‌ల నుంచి డేటాను సంగ్రహించే సదుపాయం ఉంది. నోటీసు అందిన 24 గంటల్లోగా సమాధానం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని లేఖలో బెదిరించారు.
- Tags
తాజావార్తలు
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!