ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న నకిలీ లేడీ పోలీస్ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రజలను మోసం చేసిన ఓ మహిళను కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సౌత్ వెస్ట్) బృందం సహాయంతో లంగర్ హౌజ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆమె నుంచి పోలీసు యూనిఫాం, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తిని గుడిశెల అశ్విని మోసం చేసింది. తాను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అని లంగర్ హౌజ్‌కి చెందిన బాధితుడు రాకేష్ నాయక్‌తో నమ్మబలికింది. వాస్తవానికి, ఆమె నకిలీ గుర్తింపు కార్డును సిద్ధం చేసింది.
Also Read : Mallu Ravi : హరగోపాల్‌పైన ‘ఉపా’ కేసలు పెట్టి వేధించడం ఈ పాలకుల దుశ్చర్యలకు నిదర్శనం
క్రమం తప్పకుండా పోలీసు యూనిఫాం కూడా ధరించి విధులకు వెళ్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అయితే.. ఉద్యోగం కోసం బాధితుడు రూ.30వేలు ఇవ్వగా.. కొన్ని రోజులుగా గడిచినా ఉద్యోగం రాకపోవడంతో ఆశ్వినిని సదరు వ్యక్తి నిలదీశాడు. దీంతో.. రూ.10వేలు తిరిగి ఇచ్చింది. మిగితా డబ్బులు ఇప్పుడు అప్పుడు అంటూ కాలం వెల్లదీస్తుండటంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో నకిలీ పోలీసులు వ్యవహారం గుట్టు రట్టైంది. ఈ మేరకు పోలీసులు ఆశ్వినిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం పేరిటి ఇంకా ఎంతమందిని మోసం చేసిందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read : Adipurush: థియేటర్ లో హనుమంతుని సీటు ఎలా ఉందో చూడండి