Site icon NTV Telugu

Fake Insurance Gang : నకిలీ ఇన్సూరెన్సు ముఠా గుట్టు రట్టు.. వీళ్ల తెలివి తగలెయ్య..

Chauhan

Chauhan

రాచకొండ పరిధిలో నకిలీ ఇన్సూరెన్సు ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ చౌహన్ వివరాలను వెల్లడించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించామని, విచారణలో నిందితులు నాలుగు కోట్ల విలువైన నకిలి ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలు సృష్టించారని తేలిందన్నారు. నిజామాబాద్ కి చెందిన కొసరాజు రంగ సాయి హర్ష ఈ కేసులో ప్రధాన నిందితుడు అని, నిజామాబాద్ కి చెందిన మరో నిందితుడు దుప్పల పాటి అక్షయ్ కుమార్ నకిలీ పాన్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్ లు క్రియేట్ చేసేవాడన్నారు. అంతేకాకుండా.. ‘మేడ్చల్ జిల్లా యాప్రాల్ కి చెందిన ఎన్ఆర్ఐ ఫిర్యాదు తో ఈ మోసం బయట పడింది. నిందితులు అంతా పేరొందిన ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నకిలి ఇన్సూరెన్స్ లు ఇస్తున్నారు… ఎన్ ఆర్ ఐ కిషోర్ కుమార్ కు రావాల్సిన డబ్బులు మరో కిషోర్ కుమార్ అకౌంట్ లోకి 7600562 క్రెడిట్ అయ్యాయి.

Also Read : Prabhas: స్టైల్ మారింది.. మా డార్లింగ్ లుక్ మారింది

కొంతమంది పాలసీ మెచ్యూరిటీ అయినాక కూడా క్లైమ్ కోసం రావడం లేదు. వారికి పాలసీ మెచ్యూరిటీ అయిన విషయం తెలియదు.. మరి కొన్ని పాలసీ లలో..పాలసీ హోల్డర్ చనిపోయినా.. నామినీ కి పాలసీ విషయం తెలియదు.. ఎక్కువ మంది ఎన్నారైలు…ఇన్సూరెన్స్ కంపెనీలతో టచ్ లో వుండటం లేదు.. ఇవన్నీ..పేరున్న ఇన్సూరెన్స్ కంపనీలో…రిలేషన్స్ మేనేజర్ గా పనిచేస్తున్న A1 నిందితుడు రంగ సాయి హర్ష గమనించాడు… మరో అయిదుగురు తో కలిసి…ఒక ముఠా ఏర్పాటు చేసి..ఇలాంటి పాలసీ లు అన్నీ వారికి తెలిసిన అకౌంట్ లోకి డబ్బులు మల్లించుకునే వారు.. 2019 నుండి..ఇప్పటిదాకా 19 కేసుల్లో..4 కోట్లు కొల్లగొట్టారు.. ‘ అని సీపీ వెల్లడించారు. అయితే బాధితుడు కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. నేను 13 ఏళ్ల పాత పాలసీ నీ.. డీటెయిల్స్ అప్డేట్ కోసం..ఐసీఐసీఐ లాంబార్డ్ కి వెళ్ళాను..

Also Read : Minister Malla Reddy : దేశ ప్రజలంతా నెక్స్ట్ పీఎం కేసీఆర్‌ కావాలని కోరుకుంటున్నారు

అప్పటికే నా పాలసీ మెచ్యూరిటీ అయింది.. డబ్బులు కూడా మీ ఈమెయిల్ రెక్వెస్ట్ ప్రకారం ..మీరు చెప్పిన అకౌంట్ లోకి వెళ్ళాయి అని చెప్పారు.. నేను షాక్ అయ్యాను..రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేశాను ‘ అని వెల్లడించాడు. పోలీసుల దర్యాప్తులో… ఈ మోసం అంతా బయట పడింది. పాలసీ హోల్డర్ లు..వారి ఈమెయిల్ ఐడీ , ఫోన్ నంబర్ లు ఎప్పటికీ అప్పుడు చూసుకోవాలి.. అసలు పాలసీ హోల్డర్ కు చెందిన పాన్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్ , ఈమెయిల్ , ఫోన్ నంబర్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు… వాటి ద్వారా అసలు పాలసీ హోల్డర్ మాదిరి… నకిలీ తయారు చేస్తున్నారని సీపీ వెల్లడించారు.

Exit mobile version