NTV Telugu Site icon

Hyderabad: నగరంలో నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు హల్ చల్

Fake

Fake

గ్రేటర్‌ లో నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు హల్ చల్ సృష్టించారు. రాజధానిలోని ప్రముఖ హోటళ్లలో చెకింగ్ పేరుతో యజమానులకు బెదిరింపులకు గురిచేశారు. కేసులు నమోదు చేస్తామని, హోటల్ సీజ్ చేస్తామంటూ బెదిరించారు. నిన్న రాత్రి గిస్మత్ మండీ హోటల్లో ఇన్స్పెక్టర్ అంటూ తనిఖీలు చేపట్టారు. అక్రమ సంపాదన కోసం ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా అవతారం ఎత్తిన ఇద్దరు మహిళలు ఈ మేరకు రెచ్చిపోయారు. మరోపక్క సిటీలో పెరిగిన ఫుడ్ తనిఖీల నేపథ్యంలో హోటల్ యజమానులు హడలిపోతున్నారు.

READ MORE: Yogeshwar dutt: వినేష్ ఫోగట్.. దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే

ఈ తరుణంలో నకిలీ ఇన్స్‌పెక్టర్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. మరొక హోటల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చామంటూ తనిఖీలు చేపట్టారు. అనుమానం తో జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆశ్రయించిన హోటల్ యజమానులు.. విషయం తెలుసుకుని బిత్తరపోయారు. పలువురు హోటల్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు వల వేసి పట్టుకున్నారు. పేట్ బషీర్ పేట్ పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదైంది. సికింద్రాబాద్ ఆల్ఫా , స్వాగత్ గ్రాండ్, కెప్టెన్ కుక్, పరివార్, కృతంగా హోటల్స్.. బాధిత హోటళ్లలో ఉన్నట్లు సమాచారం.