Site icon NTV Telugu

Adilabad Police: పోలీసులా మజాకా..! కటౌట్‌లతో ప్రమాదాల కట్టడి..!

Adilabad2

Adilabad2

Fake Cop, Real Impact: ఫొటో చూశారా..? అచ్చం పోలీసు కానిస్టేబుల్ నిల్చొన్నట్టు పక్కనే పోలీసు కారు ఉన్నట్లు కనిపిస్తుంది కదూ.. నిజంగా అక్కడ కానిస్టేబుల్ నిలబడ్డారని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.. అక్కడ ఉన్నది నిజమైన పోలీసు కాదు.. అది నిజమై పోలీస్ కారూ కాదు.. ఇది ఓ కటౌట్‌ మాత్రమే.. జిల్లాలో జాతీయ రహదారిపై వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలను అరికట్టడానికి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దూర దృష్టి , మేధాశక్తి తో జిల్లాలో నూతనంగా జాతీయ రహదారి – 44 పై ప్రమాదాల నివారణకు ఇలా వినూత్న రీతిలో చర్యలు తీసుకున్నారు.

READ MORE: KTR: ఈవీఎం వద్దు.. బ్యాలెట్ పేపర్ ముద్దు

హైవేపై.. అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న హాట్స్పాట్లను గుర్తించి అక్కడ వేగ నియంత్రణ కోసం ప్రత్యేకంగా డయల్ 100 వాహనం, ట్రాఫిక్ కానిస్టేబుల్ తో కూడిన కటౌట్ లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు వాహనదారులు వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని గుడిహత్నూర్ మేకల గండి వద్ద నేరడిగొండ మండలం బంధం ఎక్స్ రోడ్డు వద్ద రెండు చోట్ల ఈ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వాహనం పోలీసులు ఉంటేనే వాహనదారులు ప్రజలు సరైన ట్రాఫిక్ నియమ నిబంధనలు వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలకు గురికాకుండా ఉంటారని తెలిపారు. వాహనదారులకు స్వీయ వేగ నియంత్రణ లేకపోవడం ద్వారా గత రెండు సంవత్సరాలలో ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని.. ఆ ప్రదేశాలను గుర్తించి ప్రాణనష్టాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా కటౌట్లను చేశామన్నారు. ఈ కటౌట్‌లు చూసి వాహనదారులు బ్రేకులు వేస్తూ.. వేగాన్ని తగ్గిస్తున్నారని.. హెల్మెట్ ధరిస్తున్నారని చెప్పారు.

Exit mobile version