Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Fake Bank Operating In City 8 Other Places In Tamil Nadu Busted

Fake Bank: కేటుగాళ్ల కొత్త ట్రెండ్.. ఏకంగా నకిలీ బ్యాంకులే పెట్టేస్తున్నారు..

Published Date :November 9, 2022 , 12:38 pm
By Mahesh Jakki
Fake Bank: కేటుగాళ్ల కొత్త ట్రెండ్.. ఏకంగా నకిలీ బ్యాంకులే పెట్టేస్తున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fake Bank: మీరు చూస్తున్నది నిజమేనండి.. ఓ ఘరానా కేటుగాడు ఏకంగా నకిలీ బ్యాంకులనే ఏర్పాటు చేశాడు. ఉద్యోగులను నియమించుకుని బ్యాంకుకు ఏ మాత్రం తగ్గకుండా కార్యకలాపాలు చేపట్టాడు. ఖాతాలు తెరవడమే కాకుండా డిపాజిట్లు కూడా తీసుకున్నాడు. మొత్తం 9 బ్రాంచీలను తెరిచి దందా కొనసాగిస్తున్నాడు ఆ కేటుగాడు. ఎలా అనుమానం వచ్చిందో, లేదంటే ఎవరైనా బాధితులు సమాచారం ఇచ్చారో కానీ.. ఒకేసారి తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో పుట్టిన బ్యాంక్‌లపై పోలీసులు ఏకకాలంలో స్టింగ్ ఆపరేషన్ చేశారు. మొత్తం 9 జిల్లాల్లో విస్తరించిన నకిలీ బ్యాంక్‌ల గుట్టును ఛేదించారు.

గతంలో ఫేక్‌ కరెన్సీ, ఫేక్‌ ఉద్యోగాలు, ఫేక్‌ సర్టిఫికేట్లు, ఇతర ముఠాల గురించే అందరూ చూసే ఉంటారు. కానీ నిజమైనా బ్యాంకులను పోలిన ఉత్తుత్తి బ్యాంకులను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావచ్చు. తమిళనాడుకు చెందిన చంద్రబోస్ అనే యువకుడు చెన్నైలో ఓ బ్యాంకును తెరిచాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ‘గ్రామీణ రైతుల సహకార బ్యాంకు’ అని పేరు పెట్టాడు. చెన్నై సహా తొమ్మిది చోట్ల బ్రాంచీలు కూడా ఏర్పాటు చేశాడు. లండన్‌లో చేసిన ఎంబీయే డిగ్రీ, గత ఉద్యోగ అనుభవంతో పకడ్బందీగా బ్యాంకును ఏర్పాటు చేశాడు ఆ యువకుడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తమ బ్యాంకుకు గుర్తింపు ఉందని చూపించుకునేందుకు ఓ నకిలీ ధ్రువపత్రాన్ని తయారు చేశాడు. మిగతా బ్యాంకుల తరహాలోనే డిపాజిట్, విత్ డ్రా స్లిప్పులు, స్టాంపులతో పాటు సిబ్బందిని నియమించుకుని బ్యాంక్‌ను నడిపించాడు. ఉద్యోగం ఇవ్వడానికి కూడా రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా వసూలు చేశాడట.

Gold Buying: బంగారంపై దృష్టిసారించిన బ్యాంకులు.. టాప్‌లో ఆర్బీఐ..

చెన్నైలో తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో.. చెన్నై సహా మధురై, నామక్కల్, సేలం, ఈరోడ్ జిల్లాల్లోనూ వేరు వేరు పేర్లతో బ్యాంకులను విస్తరించాడు. అయితే, అనతి కాలంలో పుట్టగొడుగుల్లా బ్యాంకులు పుట్టుకురావడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ వ్యవస్థ అంతా వట్టి ఫేక్ అని పోలీసులు తేల్చారు. ఉత్తుత్తి బ్యాంకులో సిబ్బందిగా పని చేస్తున్న అందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ప్రస్తుతానికి రూ. 60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 46 మందిని మేనేజర్లు, క్యాషియర్లు, క్లర్కుల పేరుతో నియమించుకున్నాడు. కొత్త ఖాతాలను తెరవడంతో పాటు, డిపాజిట్ల పేరుతో రూ. 2 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేశాడు. తమిళనాడులో నడుస్తున్న ఈ బ్యాంకు వ్యవహారం రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వెళ్లింది. దీంతో ఈ బ్యాంకుకు గుర్తింపు లేదని, ఫోర్జరీ సర్టిఫికెట్ తో బ్యాంకును తెరిచారని పోలీసులకు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు బ్రాంచీలను అన్నింటినీ మూసేసినట్లు చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ వివరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • created faka bank
  • Crime News
  • Fake Bank
  • Fake bank operating in chennai
  • fraud

తాజావార్తలు

  • Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్‌లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!

  • Iran-Israel War: రైల్లో ప్రయాణం చేయొద్దు.. ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

  • Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!

  • Liquor Shop Holidays: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీల్లో వైన్ షాపులు క్లోజ్!

  • Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions