ఫేక్ బ్యాంక్ గ్యారంటీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న 4 ముఠాలను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అయితే.. ఈ సందర్భంగా సీసీఎస్ అడిషనల్ డీసీపీ నేహా మెహ్రా మాట్లాడుతూ.. కోల్‌కతా కేంద్రంగా ఫేక్ బ్యాంక్ గ్యారంటీలతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు చెక్కులు, నకిలీ బ్యాంక్ గ్యారంటీ పత్రాలు,5 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వరంగల్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తికి కోల్ కత్తాకు చెందిన నరేష్ శర్మ, దాసు, సుబ్రజిత్ గోషాల్ వారితో పరిచయం అయ్యిందని ఆమె తెలిపారు. హశ్రిత ఇన్ఫ్రా కంపెనీ కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బయో మైనింగ్‌కు కాంట్రాక్టు వచ్చిందని, ప్రాజెవెల్, సందీప్ రెడ్డి, నాగరాజును అప్రోచ్ అయ్యారని ఆమె పేర్కొన్నారు.
Also Read : Nadendla Manohar: ప్రభుత్వం పేదలకు అందించే వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
14 శాతం కమీషన్ పై ఇండస్ ఇండ్ బ్యాంక్ పేరుతో కోటి రూపాయల విలువ గ్యారంటీ పత్రాలు నాగరాజు అందించారని, 47 లక్షలు కమీషన్ గా పొందాడని వివరించారు. హార్షిత కంపెనీకి నల్గొండ జిల్లాలో 11 బయో మైనింగ్ కాంట్రాక్టులు మంజూరు అయ్యాయని, వీటికి బ్యాంక్ గ్యారంటీ పత్రాలు 2 కోట్ల 25 లక్షలకు అందించాడని ఆమె తెలిపారు. వెరిఫికేషన్ కు పంపగా ఈ బ్యాంక్ గ్యారంటీ పత్రాలు ఫేక్ అని తేలాయని, నిందితులు ఇప్పటి వరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో60 నకిలీ పత్రాలను కమీషన్ పై అందించారని ఆమె వెల్లడించారు. ఆ నకిలీ పత్రాల విలువ 35 కోట్లు ఉంటుందని ఆమె వివరించారు.
Also Read : Ratha Saptami Tirumala Special Live: రథసప్తమి సూర్యజయంతి వేళ సర్వభూపాల వాహనంపై శ్రీవారు