Site icon NTV Telugu

Fake Apple Products: చౌక ధరకే నకిలీ యాపిల్‌ ప్రాడక్ట్స్‌.. యాపిల్‌ ప్రియులే టార్గెట్‌

Iphone

Iphone

Fake Apple Products: ఐ ఫోన్‌…! ఇది మొబైల్‌ ఫోన్‌ కాదు… ఓ స్టేటస్‌ సింబల్‌ !! లక్ష రూపాయల విలువైన వేరే మోడల్‌ ఫోన్‌ వాడుతున్నా… 50 వేల ఐ ఫోన్‌ ఉంటేనే గొప్ప !! కనీసం చేతికి యాపిల్‌ వాచ్‌ ఐనా ఉండాలి.. అని ఫీల్‌ అయ్యే వారినే టార్గెట్‌ చేసిందో ముఠా. చౌక ధరకే యాపిల్‌ ప్రాడక్ట్స్‌ అంటూ ఆకర్షించారు. నకిలీ ఐ ఫోన్లు, యాపిల్‌ వాచ్‌లు, ఇయర్‌ పాడ్స్‌ అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. ఏకంగా 3 కోట్ల రూపాయల విలువైన నకిలీ యాపిల్‌ ప్రోడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చేతిలో లక్ష రూపాయల వేరే బ్రాండ్‌ మొబైల్‌ ఫోన్‌ ఉన్నా సరే. కనీసం 50 వేల రూపాయల యాపిల్‌ ఫోన్‌ ఉంటేనే శాటిస్‌ఫాక్షన్!!. ఐ ఫోన్‌ వాడుతున్న వారిని ఒకలా.. వాడని వారిని మరోలా చూసే వ్యక్తులూ కూడా ఉన్నారు. ఇలాంటి యాపిల్‌ ప్రియులనే టార్గెట్‌ చేసిందో ముఠా. తక్కువ ధరకే న్యూ మోడల్‌ యాపిల్‌ ప్రోడక్ట్స్‌ ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు..

READ MORE: Crime News: ప్రియుడితో మాట్లాడుతుందని.. అక్కను హత్య చేసిన తమ్ముడు!

మీర్‌ చౌక్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో కుప్పలుతెప్పలుగా నకిలీ యాపిల్‌ ప్రోడక్ట్స్‌ బయటపడ్డాయి. ఏకంగా 3 కోట్ల రూపాయల విలువచేసే నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నకిలీ ప్రోడక్ట్స్‌‌పై యాపిల్‌ స్టిక్కర్లను వేసి… చూసేందుకు అచ్చం యాపిల్‌ ప్రోడక్ట్ అని నమ్మించేలా మారుస్తున్నారు. ఆఫర్‌లో తక్కువ ధరకే అమ్ముతున్నామంటూ.. మాయ చేస్తున్నారు. షాప్‌ నిర్వాహకులు షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్‌ రాజ్‌పుత్‌ అనే ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు కొనుగోలు చేసి.. వాటిపై యాపిల్‌ లోగో, స్టికర్లు వేయడమే కాకుండా… బాక్స్‌ ప్యాకేజింగ్‌ కూడా యాజిటీజ్‌ యాపిల్‌ ప్రోడక్ట్‌‌ను తలపించేలా కలరింగ్ ఇస్తున్నారు. ఆఫర్ల పేరుతో తక్కువ ధరకే యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్, పవర్‌ బ్యాంక్‌లు, కేబుల్స్ అమ్ముతున్నారు. ఏకంగా 2,761 నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు..

READ MORE: Vikarabad: పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం.. తరిమేసిన భర్త.. షాక్‌ ఇచ్చిన ప్రియుడు..

నిందితులను మీర్‌చౌక్‌ పోలీసులకు అప్పగించింది టాస్క్‌ఫోర్స్‌ టీం. ట్విస్ట్‌ ఏంటంటే.. టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ రైడ్‌‌లో యాపిల్‌ కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. నకిలీ ప్రోడక్ట్స్‌ ఏవో.. తమ ఒరిజినల్‌ ప్రాడక్ట్స్‌ ఏవో కూడా యాపిల్‌ ప్రతినిధులే గుర్తుపట్టలేనంతగా మార్చారు కేటుగాళ్లు. వాటికున్న బార్‌కోడ్స్‌ను స్కాన్‌ చేయడం ద్వారా నకిలీ వస్తువులను గుర్తించారు. చూసేందుకు అచ్చం యాపిల్‌ ప్రోడక్ట్స్‌ లానే ఉంటాయి. ఒరిజినల్‌‌కి ఏమాత్రం తీసిపోవు. మార్కెట్లో ఒరిజినల్‌ ప్రోడక్ట్‌ ధర లక్షల్లో ఉంటుంది. కానీ.. ఇక్కడ మాత్రం వేల రూపాయలకే అమ్ముతుంటారు. అంత పెద్ద బ్రాండ్‌ ప్రోడక్ట్‌ను ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతుంటారు.. అని ఏమాత్రం ఆలోచించరు. తక్కువ ధరకు దొరికిందా లేదా…! దానిపై యాపిల్ బ్రాండ్‌ ఉందా లేదా..! ఇది చాలు. అది ఒరిజినలా కాదా.. ఎంత కాలం పనిచేస్తుంది.. దాని మన్నిక ఎంత.. ఇవేం పట్టవు! సోషల్‌ మీడియాలో ప్రకటనలు చూడటం.. షాప్‌ గురించి ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా కొనేయడం యువకులకు అలవాటుగా మారింది..

Exit mobile version