Fake Apple Products: చౌక ధరకే నకిలీ యాపిల్ ప్రాడక్ట్స్.. యాపిల్ ప్రియులే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Apple Products: ఐ ఫోన్…! ఇది మొబైల్ ఫోన్ కాదు… ఓ స్టేటస్ సింబల్ !! లక్ష రూపాయల విలువైన వేరే మోడల్ ఫోన్ వాడుతున్నా… 50 వేల ఐ ఫోన్ ఉంటేనే గొప్ప !! కనీసం చేతికి యాపిల్ వాచ్ ఐనా ఉండాలి.. అని ఫీల్ అయ్యే వారినే టార్గెట్ చేసిందో ముఠా. చౌక ధరకే యాపిల్ ప్రాడక్ట్స్ అంటూ ఆకర్షించారు. నకిలీ ఐ ఫోన్లు, యాపిల్ వాచ్‌లు, ఇయర్ పాడ్స్ అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. ఏకంగా 3 కోట్ల రూపాయల విలువైన నకిలీ యాపిల్ ప్రోడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చేతిలో లక్ష రూపాయల వేరే బ్రాండ్ మొబైల్ ఫోన్ ఉన్నా సరే. కనీసం 50 వేల రూపాయల యాపిల్ ఫోన్ ఉంటేనే శాటిస్ఫాక్షన్!!. ఐ ఫోన్ వాడుతున్న వారిని ఒకలా.. వాడని వారిని మరోలా చూసే వ్యక్తులూ కూడా ఉన్నారు. ఇలాంటి యాపిల్ ప్రియులనే టార్గెట్ చేసిందో ముఠా. తక్కువ ధరకే న్యూ మోడల్ యాపిల్ ప్రోడక్ట్స్ ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు..
READ MORE: Crime News: ప్రియుడితో మాట్లాడుతుందని.. అక్కను హత్య చేసిన తమ్ముడు!
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో కుప్పలుతెప్పలుగా నకిలీ యాపిల్ ప్రోడక్ట్స్ బయటపడ్డాయి. ఏకంగా 3 కోట్ల రూపాయల విలువచేసే నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నకిలీ ప్రోడక్ట్స్‌పై యాపిల్ స్టిక్కర్లను వేసి… చూసేందుకు అచ్చం యాపిల్ ప్రోడక్ట్ అని నమ్మించేలా మారుస్తున్నారు. ఆఫర్లో తక్కువ ధరకే అమ్ముతున్నామంటూ.. మాయ చేస్తున్నారు. షాప్ నిర్వాహకులు షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్‌పుత్ అనే ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు కొనుగోలు చేసి.. వాటిపై యాపిల్ లోగో, స్టికర్లు వేయడమే కాకుండా… బాక్స్ ప్యాకేజింగ్ కూడా యాజిటీజ్ యాపిల్ ప్రోడక్ట్‌ను తలపించేలా కలరింగ్ ఇస్తున్నారు. ఆఫర్ల పేరుతో తక్కువ ధరకే యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్, పవర్ బ్యాంక్‌లు, కేబుల్స్ అమ్ముతున్నారు. ఏకంగా 2,761 నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
READ MORE: Vikarabad: పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం.. తరిమేసిన భర్త.. షాక్ ఇచ్చిన ప్రియుడు..
నిందితులను మీర్‌చౌక్ పోలీసులకు అప్పగించింది టాస్క్‌ఫోర్స్ టీం. ట్విస్ట్ ఏంటంటే.. టాస్క్ ఫోర్స్ టీమ్ రైడ్‌లో యాపిల్ కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. నకిలీ ప్రోడక్ట్స్ ఏవో.. తమ ఒరిజినల్ ప్రాడక్ట్స్ ఏవో కూడా యాపిల్ ప్రతినిధులే గుర్తుపట్టలేనంతగా మార్చారు కేటుగాళ్లు. వాటికున్న బార్‌కోడ్స్‌ను స్కాన్ చేయడం ద్వారా నకిలీ వస్తువులను గుర్తించారు. చూసేందుకు అచ్చం యాపిల్ ప్రోడక్ట్స్ లానే ఉంటాయి. ఒరిజినల్‌కి ఏమాత్రం తీసిపోవు. మార్కెట్లో ఒరిజినల్ ప్రోడక్ట్ ధర లక్షల్లో ఉంటుంది. కానీ.. ఇక్కడ మాత్రం వేల రూపాయలకే అమ్ముతుంటారు. అంత పెద్ద బ్రాండ్ ప్రోడక్ట్‌ను ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతుంటారు.. అని ఏమాత్రం ఆలోచించరు. తక్కువ ధరకు దొరికిందా లేదా…! దానిపై యాపిల్ బ్రాండ్ ఉందా లేదా..! ఇది చాలు. అది ఒరిజినలా కాదా.. ఎంత కాలం పనిచేస్తుంది.. దాని మన్నిక ఎంత.. ఇవేం పట్టవు! సోషల్ మీడియాలో ప్రకటనలు చూడటం.. షాప్ గురించి ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా కొనేయడం యువకులకు అలవాటుగా మారింది..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!