Site icon NTV Telugu

Maharashtra: ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలు

Maharashtra

Maharashtra

మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు. ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం పాత్రలు మాత్రమే మారాయని.. అభివృద్ధి మాత్రం ఎక్కడా ఆగదని తెలిపారు. ముగ్గురం కలిసే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును బట్టి మంత్రులను ఎంపిక చేస్తామన్నారు. ఇక డిసెంబర్‌ 7 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

READ MORE: TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ సేవలు..

నేడు మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. విధాన్‌ భవన్‌ కాంప్లెక్స్‌ ఆవరణలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహానికి సీఎం, డిప్యూటీ సీఎంలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎంలతోపాటు ఎమ్మెల్యేలంతా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

READ MORE:7-Seater Car : సెంట్రల్ AC కలిగిన ఈ 7-సీటర్ కారు.. అమ్మకాలలో ఘోరంగా విఫలమైంది!

ఇదిలా ఉండగా… మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన మహాయుతి సర్కార్ లో తనకు హోంశాఖను ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే పట్టుబట్టారని శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే తెలిపారు. షిండే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం ఫడ్నవీస్‌కు హోంశాఖ ఇచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందే డిసెంబరు 11 నుంచి 16 మధ్య రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు. నాగ్‌పూర్‌లో డిసెంబర్ 16వ తేదీన శాసనసభ శీతాకాల సమావేశాలు స్టార్ట్ కానున్నాయి.

Exit mobile version