Site icon NTV Telugu

‘Kantara’ Personal Life: అప్పులు ఎక్కువై మారువేషాల్లో తిరిగిన కాంతారా.. ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉందంటే..

Rishab Shetty Family

Rishab Shetty Family

Kantara Personal Life : కాంతారా ఇప్పుడు అందరి నోటా ఇదే మాట.. ఆ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి గురించిన చర్చే. ఒక్క సినిమాతో ఇండియా అంతటా క్రేజ్ సంపాదించుకున్నాడు. కాంతార సినిమాకు ముందు రిషబ్ శెట్టి కేవలం కన్నడలో ఓ హీరో మాత్రమే… కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో రిషబ్ శెట్టి పర్సనల్ విషయాలపై అభిమానులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు రిషబ్ శెట్టికి ఒక్క తెలుగులోనే కాదు..ఇతర భాషాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. రిషబ్ షెట్టికి పెళ్లై భార్య పిల్లలు ఉన్నారు. రిషబ్ శెట్టి భార్య పేరు ప్రగతి శెట్టి. కూతురు రాధ్య. రిషబ్ శెట్టి .. ప్రగతిని 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహం జరిగే ముందు కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు జరిగాయంట.

Read Also: ‘RRR’ Creating New Record: జపాన్‌లోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు కలెక్షన్ల సునామీ.. మొదటి ఇండియన్‌ సినిమాగా రికార్డు..!

రిషబ్ శెట్టి 2016లో ఓ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో రక్షిత్ శెట్టి హీరో. ఈ సినిమా ఈవెంట్ కు ప్రగతి శెట్టి హాజరైంది. ఇక్కడే ప్రగతి శెట్టిని చూశాడు రిషబ్ శెట్టి. ఆ తరువాత చూసీ చూడనట్లుగా వదిలేశారు. ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ప్రగతి రిక్వెస్ట్ పంపినట్లు మెసేజ్ వచ్చింది. అంతకుముందే ప్రగతి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసింది. కానీ కొన్ని పనుల వల్ల అది చూసుకోలేదు. ఈసారి ఆమె రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశాడు. ఆ తరువాత ప్రగతితో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. అలా కొన్ని రోజుల పాటు చాటింగ్ చేయడంతో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహంకాస్త ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వీరి పెళ్లికి ప్రగతి బంధువులు ఒప్పుకోలేదు. ఎందుకంటే రిషబ్ శెట్టి ఇంకా ఆ సమయంలో సెటిల్ కాలేదు. అయినా ప్రగతి శెట్టి మాత్రం ఒప్పుకోలేదు. రిషబ్ శెట్టినే పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టింది. దీంతో ఇద్దరు 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇటీవలే రిషబ్ శెట్టి నటించిన సినిమాలో భార్య ప్రగతి శెట్టి కూడా ఓ పాత్రలో కనిపించారు.

Read Also: Nizamabad : తల్లితో సహజీవనం చేస్తూ ఆమె ఆరేళ్ల కూతురుపై అత్యాచారం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి

అప్పులు ఎక్కువై మారువేషాల్లో తిరిగా: కాంతార
కాంతార మూవీ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి తన జీవితంలో నెలకొన్న చేదు జ్ఞాపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఓ వైపు సినిమాలు చేస్తూనే 2009లో హోటల్ వ్యాపారం ప్రారంభించా. 5నెలల్లోనే మూతపడింది. రూ.25లక్షల అప్పు అయింది. వడ్డీలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వచ్చేది. అప్పులోల్ల నుంచి తప్పించుకునేందుకు మారు వేషాల్లో తిరిగాను. జేబులో రూపాయి లేకపోవడంతో కుమిలిపోయా’ అని రిషబ్ తెలిపాడు.

Read Also: Elon Musk Shocking Desicion : ఎలాన్ మస్క్ నిర్ణయంతో ఆందోళన చెందుతున్న ట్విటర్ ఉద్యోగులు

కాంతార’ సినిమాను కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్ని నిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించారు. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. విడుదల చేసిన ప్రతీచోట కూడా కాంతార హిట్ టాక్ తెచ్చుకుంది.

Exit mobile version