‘RRR’ Creating New Record: అపజయమే తెలియని దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దిన అద్భుత దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాలు సృష్టిస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని మరింత విస్తృతం చేస్తూ.. అంతకుముందు రాజమౌళి తీసిన బాహుబలి రికార్డులను తిరగరాస్తోంది. ఆ సినిమా పేరిట ఉన్న ఎన్నో రికార్డులను ఇప్పటికే బ్రేక్ చేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా రిలీజైన ప్రతి భాషలో డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాతో రాజమౌళి మరోసారి అద్భుతమైన టేకింగ్‌తో మాయ చేశాడు. ఈ సినిమాతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డు సృష్టించింది.
Read Also: Nizamabad : తల్లితో సహజీవనం చేస్తూ ఆమె ఆరేళ్ల కూతురుపై అత్యాచారం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
ఇటీవలే ఈ చిత్రం జపాన్‌లో విడుదలైంది. రిలీజ్‌కు వారం ముందు నుంచి ఆర్‌ఆర్‌ఆర్ బృందం జపాన్‌లో ప్రమోషన్‌లు పెద్ద ఎత్తున జరపడంతో ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. అంచనాలకు తగ్గట్టే ట్రిపుల్‌ఆర్ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. కాగా తాజాగా ఈ చిత్రం ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్‌లో 75M Yen(రూ.4 కోట్లను) కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఫస్ట్ వీక్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ముత్తు మొదటి స్థానంలో ఉండగా.. బాహుబలి రెండో స్థానంలో ఉంది. మరి ఈ సారైనా ముత్తు రికార్డును ఆర్‌ఆర్‌ఆర్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.