NTV Telugu Site icon

Fact Check: ఆ రెవెన్యూ రికార్డు నకిలీది.. ఏపీ ప్రభుత్వం

Fake

Fake

Fact Check: సోషల్ మీడియాలో ఓ నకిలీ భూమి పట్టా సంబంధించిన ఫోటో వైరల్ కావడంతో దానిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన భూమి పట్టాలో ఓ భూమికి సంబంధించిన అడంగల్ పత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంపులు మంత్రి సత్యప్రసాద్ ఫోటోలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోని కొందరు కావాలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో చాలామంది భూమి పట్టాలు ఒరిజినల్ కాదని చెక్ చేయకుండా.. కొత్తగా మంత్రి ముఖ్యమంత్రుల ఫోటోలు వచ్చాయ అంటూ కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియా వేదికగా అసలు నిజాన్ని వెల్లడించారు.

Central Government Jobs: ఉద్యోగాల జాతర.. ఏకంగా 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

తాజాగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ ఎక్స్ ఖాతా ద్వారా ఆ నకిలీ భూమిపట్టాను షేర్ చేస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఫోటోలు ముద్రించినటువంటి రెవెన్యూ రికార్డు నకిలీదని చెబుతూనే.. కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ఇటువంటి దుష్ప్రచారం వల్ల అప్రమత్తంగా ఉండండి అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజలను అలర్ట్ చేసింది. కాబట్టి ఏదైనా విషయాన్ని తెలుసుకునేటప్పుడు అది సరైన వ్యక్తి నుండి వచ్చిందా..? లేదా..? ఏదైనా గవర్నమెంట్ సంబంధిత సైట్ నుంచి చెక్ చేసుకున్న తర్వాతనే వాటి గురించి ఆలోచన చేస్తే మంచిది. లేకపోతే అనేక అనర్ధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.