Site icon NTV Telugu

Facebook : జుకర్ బర్గ్‎కు పుతిన్ షాక్.. తీవ్రవాద సంస్థల జాబితాలో ఫేస్ బుక్

Facebook

Facebook

Facebook : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ షాక్ ఇచ్చారు. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాను తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ దేశానికి అమెరికా మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికే పలు కీలక సంస్థలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఫెడరల్ సర్వీస్ ఫర్ ఫైనాన్సియల్ మానిటరింగ్(రోస్ఫిన్ మోనిటరింగ్) మంగళవారం పేర్కొంది.

Read Also: Adani : గంగవరం 100శాతం అదానీదే.. ఆల్ క్లియర్

ఈ ఏడాది ప్రారంభంలోనే రష్యా కోర్టు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను దేశంలో నిషేధించింది. వీటి మాతృ సంస్థ మెటాను ఉగ్రవాదిగా పేర్కొంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజాలపై క్రెమ్లిన్ అణిచివేత ప్రారంభమైంది.జుకర్‌బర్గ్‌కు చెందిన సోషల్ మీడియా ఫాట్‌ఫాం తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిందని మాస్కో కోర్టు ఆరోపించింది. ఉక్రెయిన్ లోని సోషల్ మీడియా యూజర్లు రష్యన్లపై హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను పోస్టు చేయడానికి అనుమతిస్తోందని మండిపడింది. అంతే కాకుండా మార్క్ జుకర్ బర్గ్ ను రష్యాలో ప్రవేశించకుండా నిషేధించింది. జుకర్‌బర్గ్, పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులతో పాటు రష్యా ఫోబిక్ ఎజెండాను ప్రచారం చేశారని ఆరోపించారు. యూఎస్ అధ్యక్షుడితో పాటు 963మంది అమెరికన్లపై రష్యా ఈ ఆంక్షలను విధించింది.

Read Also: Fake Astronaut Scams: వ్యోమగామినంటూ వల.. భూమికి తిరిగిరాగానే పెళ్లంటూ లక్షలు గుంజాడు..

ఇప్పుడు రష్యా తన ఉగ్రవాద సంస్థ జాబితాలో మెటాను చేర్చడం సంచలనంగా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా తన సైనిక దాడులను తీవ్రతరం చేసిన తర్వాత ఈ చర్యను అనుసరించింది . సోమవారం, మాస్కో అనేక ఉక్రేనియన్ నగరాలపై బాంబు దాడి చేసింది. దీంతో అనేక మంది పౌరులు మరణించారు. ఓ భారీ వంతెనతోపాటు పలు భవనాలు ధ్వంసమయ్యాయి.

Exit mobile version