Site icon NTV Telugu

Facebook Love Story: ఫేస్‌బుక్ ప్రేమాయణం.. బోర్డర్స్ దాటిన లవ్ స్టోరీ..

Dholpur Love Story

Dholpur Love Story

Facebook Love Story: వాళ్లది ఫేస్‌బుక్ లవ్. నిజంగా వాళ్ల ప్రేమకు ఎళ్లలు లేవని నిరూపించారు. ఇద్దరి దేశాలు వేరు అయితే ఏమిటి ప్రేమ వాళ్లని కలిపింది. ఒకరిది బంగ్లాదేశ్ మరొకరిది ఇండియా. ప్రియుడితో కలిసి జీవితాన్ని పంచుకొవాలని ప్రియురాలు ఏకంగా సొంత దేశం దాటి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ప్రియుడిని పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడింది. ఎనిమిది నెలలుగా అద్దె ఇంట్లో జీవితం సాగిస్తున్న వారిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏంటి వాళ్ల కథ.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Mirai: మిరాయ్ 2పై తేజ సజ్జా అప్డేట్

బంగ్లాదేశ్ అమ్మాయి భారత్ అబ్బాయి..
బంగ్లాదేశ్ మహిళ రాజస్థాన్‌లోని ధోల్పూర్‌ యువకుడితో అక్రమ వివాహం చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు జన్నత్ ఖానం అలియాస్ స్నేహ జార్విన్, ఆమె భర్త కబీర్ ఖాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌లో ప్రేమలో పడి తన ప్రియుడిని కలవడానికి బంగ్లాదేశ్ అమ్మాయి ధోల్పూర్‌కు వచ్చి వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోయింది. ఎనిమిది నెలలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయి దగ్గర కోల్‌కతా ఆధార్ కార్డు దొరికింది. ప్రస్తుతం వారిని పోలీసులు, నిఘా సంస్థల అధికారులు ప్రశ్నిస్తున్నారు.

జన్నత్ బంగ్లాదేశ్‌‌ దేశస్తురాలు అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. 2023లో ఆమె ధోల్పూర్‌కు చెందిన కబీర్ ఖాన్‌తో ఫేస్ బుక్‌లో పరిచయం అయ్యింది. అది తర్వాత ప్రేమగా మారింది. ఈక్రమంలో బంగ్లాదేశ్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న తానియాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. డిసెంబర్ 2024లో ఆమె తానియాతో సరిహద్దు దాటి భారతదేశానికి వచ్చింది. తానియా ఆమెను బస్సులో కోల్‌కతాకు తీసుకెళ్లి, కొన్ని రోజులు ఆమెను అక్కడే ఉంచింది. ఈసమయంలో జన్నత్ ఇండియా ఆధార్ కార్డును కూడా తయారు చేసుకుంది. తర్వాత తానియా ఆమెను ముంబైకి, అక్కడి నుంచి ఇండోర్‌కు తీసుకెళ్లింది. కబీర్ ఆమెను ఇండోర్ నుంచి ధోల్పూర్‌కు తీసుకువచ్చాడు. కల్లుగీత వ్యాపారి అయిన కబీర్ ముందుగా ఆమెను ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో కొన్ని రోజులు ఉంచాడు. తర్వాత వారిద్దరూ ధోల్‌పూర్ చేరుకు వెళ్లి వివాహం చేసుకున్నారు.

జన్నత్ తల్లి చనిపోయింది..
జన్నత్ తల్లి చనిపోయిందని, ఆమె తండ్రి సౌదీ అరేబియాలో ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేస్తున్నారని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అమిత్ శర్మ తెలిపారు. దర్యాప్తు సంస్థలు వారిని ప్రశ్నిస్తున్నాయని, బాలిక భర్త కబీర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

READ ALSO: Nepal: నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో 54 ఏళ్ల వ్యక్తి.. ఇంతకీ ఎవరు ఈయన?

Exit mobile version