Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Teja Sajja Mirai Movie Press Meet September 12 Release

Mirai: మిరాయ్ 2పై తేజ సజ్జా అప్డేట్

Published Date :September 11, 2025 , 5:40 pm
By Bhargav Chaganti
Mirai: మిరాయ్ 2పై తేజ సజ్జా అప్డేట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

హనుమాన్ కి ఇప్పటికి మీలో వచ్చిన మార్పు ఏమిటి?
-మార్పు ఏమీ లేదండి. సినిమాకి పడే కష్టంలో ఎలాంటి తేడా లేదు. ఇంతకుముందు ఎలాగైతే కొత్తరకం సినిమాలు చేయాలని అనుకున్నానో ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. హనుమాన్ కి ఎంత ఎఫర్ట్ పెట్టానో దాని కంటే ఎక్కువ మిరాయ్ కి పెట్టాను.

హనుమాన్ తర్వాత వస్తున్న మిరాయ్ విషయంలో ఒత్తిడి ఉందా?
-ఎలాంటి ఒత్తిడి లేదండి. నిజానికి హనుమాన్ విషయంలోనే చాలా ఒత్తిడి వుండేది. నేను సక్సెస్ ని ఆపాదించుకోను. ఒక సినిమాకి మించి ఇంకో సినిమా చేయాలనే అంచనాలు ఏమీ ఉండవు. ఏ సినిమాకి ఆ సినిమానే ప్రత్యేకము. ఒక సినిమాకి 100% ఎఫర్ట్ పెడుతున్నానా లేదా చూసుకుంటాను. ఒక్క గొప్ప వర్క్ చేయాలనే ఒత్తిడి తప్పితే హనుమాన్ వల్ల వచ్చిన ఒత్తిడి ఏమీ లేదు. హనుమాన్ కి గొప్ప విజయం వచ్చింది కదా.. ఆ సినిమా ఫలితాన్ని చూసి ఇందులో ఏమైనా మార్పులు చేశారా?
-లేదండి. ముందు ఈ సినిమాని ఏ స్కేల్లో అనుకున్నామో ఆ స్కేల్ లోనే తీశాం. పాన్ ఇండియన్ అని స్క్రిప్ట్ లో మార్పులు చేసేద్దాం అని ఆలోచన ఎప్పుడూ లేదు. నా మెయిన్ గ్రౌండ్ తెలుగు ఆడియన్స్. మనకోసం తీసిన సినిమా ఇది. ఇతర భాషల్లో ఆడితే ఆనందం. నేను మాత్రం తెలుగు ప్రేక్షకుల కోసమే సినిమాలు చేస్తాను.

READ MORE: Pakistan: పాకిస్థాన్ పొంచి పోషించిన ఉగ్రవాదం.. ఇప్పుడు ఆదేశానికే ముప్పుగా మారిందా..?

మిరాయ్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఒక మామూలు కుర్రాడు తన ధర్మాన్ని తెలుసుకొని, తనకి యోధులు కి ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని, ఒక పెద్ద ఆపదని ఆపడానికి తను ఎంత దూరం వెళ్తాడు? తన తల్లి ఆశయం కోసం ఎంత దూరం వెళ్తాడు? ఇతిహాసాల్లో ఉన్న సమాధానం కోసం జర్నీ చేసే క్యారెక్టర్ లో కనిపిస్తాను.

ఇందులో ఛాలెంజింగ్ అనిపించిన యాక్షన్ బ్లాక్ ఏమిటి?
-మొత్తం దాదాపు 9 యాక్షన్ బ్లాక్ ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ దేనికదే చాలెంజ్. ఎన్ని రిస్కులు ఛాలెంజ్లో తీసుకున్న సరే.. ఆడియన్స్ రిలీజ్ రోజు ఎంత థ్రిల్ అవుతారు…అదొక్కటే గుర్తొస్తుంటుంది.

శ్రీయ, జగపతిబాబుతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-శ్రియ జగపతిబాబుతో నేను చిన్నప్పుడు కలిసి నటించాను. వాళ్ళందరితో మళ్ళీ ఇప్పుడు కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. జగపతిబాబు, శ్రేయ, జయరాం చాలా పెద్ద నటులు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు. అయినప్పటికీ ఈ సినిమా మీద పాషన్ తో చాలా బిజీగా ఉన్నప్పటికీ మేమంతా కష్టపడుతుంటే వాళ్ళు అంత కష్టపడ్డారు. మాతో పాటు హిమాలయాలు నేపాల్ శ్రీలంక తో పాటు మైనస్ 80 డిగ్రీలలో కూడా వర్క్ చేశారు. మా సినిమా కోసం అంత హార్డ్ వర్క్ చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

READ MORE: Trivikram: ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ ను పక్కన పెట్టిన త్రివిక్రమ్?

మనోజ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-మనోజ్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక జీవితాన్ని చూసి వచ్చిన పాత్ర. ఆ పాత్రకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఒక పెద్ద డేంజర్ క్రియేట్ చేయగల క్యారెక్టర్. హీరో ఎలా ఎదుర్కోగలడు అనిపించేలా ఉండే క్యారెక్టర్. అలాంటి గొప్ప క్యారెక్టర్ కోసం మనోజ్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కథ, క్యారెక్టర్ చాలా ఎక్సైట్ అయ్యారు.

మ్యూజిక్ గురించి?
-హరి గౌర లాంటి డెడికేషన్ ఉన్న టెక్నీషియన్ దొరకడం చాలా చాలా ఆనందం. ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. మా జర్నీ మున్ముందు కూడా కొనసాగుతుంది.

నిర్మాత విశ్వప్రసాద్ సపోర్ట్ ఎలా వుంది?
-చాలా అరుదుగా ఇలాంటి పాషన్ ప్రొడ్యూసర్స్ ని కలుస్తాం. బిగినింగ్ నుంచి ఎక్స్ట్రాడినరీగా సినిమా చేద్దామని ప్రతి అడుగులో సపోర్ట్ చేశారు. చాలా ఫ్రీడం గౌరవం ఇచ్చి సపోర్ట్ చేశారు. ఆయన అంత స్వేచ్ఛ ఇవ్వడం వల్ల మాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఆడియన్స్ కి మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశం ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. అలాంటి ప్రొడ్యూసర్ తో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి?
-చిరంజీవి గారు ఒక పెద్ద మెసేజ్ పెట్టడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే నాని అన్న కూడా ఒక మంచి మెసేజ్ పెట్టారు. చాలామంది దర్శకులు ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కరణ్ జోహార్ ఈ సినిమా చూసి ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను. మీలాంటి ఫిలిం మేకర్స్ బయటికి రావాలి మీకు పెద్ద ప్లాట్ఫారం ఇస్తానని ప్రమోషన్స్ కి ఎంత దూరమైనా వస్తానని ఆయన చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

మిరాయ్ లో శ్రీరాముల వారి నేపథ్యం ఎలా ఉంటుంది?
-మన ఇతిహాసాలతో చాలా ఆర్గానిక్ గా బ్లెండ్ అయిన కథ ఇది. బలవంతంగా ఇరికించింది కాదు. అది చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ, వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ సినిమాలో రెండు సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ఆడియన్స్ రేపు చూడబోతున్నారు.

మిరాయ్ 2 చేసే ఆలోచన ఉందా?
సినిమా హిట్ అయితే కచ్చితంగా మిరాయ్ ఫ్రాంచైజ్ అయ్యే పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్టు. ప్రేక్షకులు ఆదరిస్తే ఖచ్చితంగా పార్ట్ 2 వస్తుంది.

కొత్తగా చేయబోతున్న సినిమాలు?
-నేను ఒక సినిమా కమిట్ అయితే అది పూర్తయి రిలీజ్ అయినంత వరకు దానిపైనే ఉంటాను. అందుకే ప్యుచర్ సినిమాలు గురించి ఆలోచించే అంత స్పేస్ ఉండటం లేదు. ఆడియన్స్ లో క్రెడిబిలిటీ సంపాదించడం పైనే నా దృష్టి ఉంటుంది. సినిమా రిలీజ్ సమయంలో ఆడియన్స్ ని థియేటర్స్ పిలిచేటప్పుడు ముందు నేను కాన్ఫిడెంట్ గా ఉండాలి. -ప్రస్తుతానికి ‘జాంబిరెడ్డి 2’ ఒక్కటే కమిట్ అయ్యాను.

READ MORE: Devan : ఐస్ క్రీమ్ తిని చనిపోయిన నటుడి భార్య..

మిరాయ్ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు?
-మిరాయ్ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఫిలిం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ అడ్వెంచరు ఫాంటసీ ఎమోషన్ డివోషనల్ ఎలివేషన్ అన్ని ఉంటాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ముఖ్యంగా పిల్లల్ని ఎక్కువగా ఆకట్టుకునే సినిమా అవుతుంది. ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిల్ ఇది. థియేటర్స్ లో ఎక్స్ట్రార్డినరీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక ఇంటర్నేషనల్ స్థాయి సినిమా ఇవ్వాలని ఉద్దేశంతో వర్క్ చేసాము. దాన్ని ఎచీవ్ చేశామని భావిస్తున్నాం. ప్రేక్షకులందరూ అదే ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • HanuMan sequel vibe
  • Karthik Gattamneni
  • Manoj Manchu
  • Mirai movie
  • pan-India film

తాజావార్తలు

  • Tirupati Girl De*ath Case Twist: రీల్స్‌ చేస్తూ బాలిక మృతిచెందిన కేసులో సంచలన ట్విస్ట్.. వెలుగులోకి కీలక అంశాలు..

  • Tamil Nadu: అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, పంపు సెట్లు.. తమిళనాడు ప్రజలపై వరాల జల్లు..

  • Fakhar Zaman: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన.. పాకిస్థాన్ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌పై నిషేధం

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • Crime: భార్యను చంపి పరారీ.. LPG సిలిండర్ బుకింగ్‌లో పట్టుబడ్డ నిందితుడు..

ట్రెండింగ్‌

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions