NTV Telugu Site icon

Tamilnadu: ఘోర ప్రమాదం.. బాణాసంచా పేలి ముగ్గురు మృతి

Tamilnadu

Tamilnadu

తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిరుపూర్ జిల్లాలో బాణాసంచా గోడౌన్ లో పేలుడు ప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి మూడు ఇళ్లు ధ్వంసం కాగా.. ముగ్గురు మృతి చెందారు, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Read Also: Ram Charan -Prashanth Neel: దానయ్య సమర్పించు ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్?

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు తీవ్రతకు మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారని చెబుతున్నారు. కాగా.. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తోంది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also: Black magic: బ్లాక్ మ్యాజిక్ తో అత్తమామను చంపేందుకు కోడలు కుట్ర..

Show comments