కరీంనగర్ పట్టణంలోని వివిధ హోటళ్లలో ఆదివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. వరంగల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ బృందాలు హోటళ్లలోని కిచెన్‌లు, స్టోర్‌రూమ్‌లలో సోదాలు నిర్వహించాయి. శ్వేత త్రీ స్టార్ హోటల్‌లో రూ.70,000 విలువ చేసే గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను గుర్తించామని అమృతశ్రీ తెలిపారు. హోటల్‌లో 20 నుంచి 25 రకాల వండిన ఆహార పదార్థాలను కూడా గుర్తించారు. అన్ని హోటళ్లలో దాడులు నిర్వహించాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు. అధికారుల తనిఖీల్లో హోటల్ స్టోర్ రూంలో కాలం చెల్లిన మసాల దినుసులు, ఐస్‌క్రీంలు, మిగిలి పోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. నగరంలో ఇప్పటికే తనిఖీలు చేపట్టిన కొన్ని హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశామని ఆమె వెల్లడించారు. కరీంనగర్లో తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని ఫుడ్ సేఫ్టీ అధికారి అమృతశ్రీ పేర్కొన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. హోటళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని దీనిపై సంబంధిత యజమాన్యాలకు నోటీసులు జారీచేస్తామని వెల్లడించారు.
Expired Food : రూ.70,000 విలువైన కాలం చెల్లిన ఆహార పదార్థాలు లభ్యం
![Food](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/05/food-1024x576.jpg)
Food