Site icon NTV Telugu

US Tariffs: భారత ఆర్థిక వ్యవస్థపై “డెడ్ ఎకానమీ” వ్యాఖ్య.. ట్రంప్‌ను విమర్శిస్తున్న సొంత దేశస్థులు..!

Us Tarif

Us Tarif

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని వైపుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంపై ఆయన అభిప్రాయంతో సొంత దేశస్థులే అసంతృప్తి చెందుతున్నారు. ఇటీవల భారత్‌పై 25% సుంకం విధించిన భారతదేశాన్ని ‘డెడ్‌ ఎకానమి’ అంటూ ఎగతాళి చేశారు. ఇది అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకు పెద్ద తప్పుగా నిపుణులు పరిగణిస్తున్నారు. మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ టెస్ట్‌బెడ్ అధ్యక్షుడు కిర్క్ లుబిమోవ్.. ట్రంప్ చేసిన డెడ్ ఎకానమి వ్యాఖ్యను తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు ‘పెద్ద భౌగోళిక రాజకీయ తప్పు’ అన్నారు. చైనా పెరుగుతున్న ఆధిపత్యాన్ని తగ్గించే అమెరికా వ్యూహానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. సుంకాలు విధించడం ద్వారా అమెరికా తన సంభావ్య మిత్రదేశాన్ని దూరం చేస్తోందని తెలిపారు. “భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ఈ పరిస్థితిలో అమెరికా సుంకాలు భారతదేశంపై తక్షణ ప్రభావాన్ని చూపుతాయి.” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE: Chicken Dum Biryani Recipe: నోరూరించే చికెన్ దమ్ బిర్యానీ.. ఇంట్లోనే చేసుకోండిలా..

అంతకుముందు, ప్రఖ్యాత చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ చేసిన డెడ్‌ ఎకానమి వ్యాఖ్యలను తిరస్కరించారు. ఈ చరిత్రకారుడు తన ప్రకటనకు మద్దతుగా ఆర్థిక డేటాను ఇచ్చారు. వృద్ధి రేసులో భారతదేశం అమెరికా కంటే చాలా ముందుందని ఆయన అన్నారు. గత సంవత్సరం భారతదేశం అమెరికా కంటే రెండు రెట్లు వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ సంవత్సరం అమెరికా కంటే భారత్ మూడు రెట్లు వేగంగా వృద్ధి చెందగలదని స్పష్టం చేశారు. టాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్ టెస్ట్‌బెడ్ చీఫ్ కిర్క్ లుబిమోవ్ సైతం.. భారతదేశంపై ట్రంప్ వైఖరిని విమర్శించారు. భారత్‌పై సుంకాలు విధించే నిర్ణయంతో విభేదించారు. ఈ నిర్ణయం ఆసియాలో అమెరికా వ్యూహాత్మక లక్ష్యాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ సుంకాలు విధించే క్రమంలో భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని అస్సలు పరిగణనలోకి తీసుకోదని లియుబిమోవ్ అన్నారు. ట్రంప్ తాజాగా భారత్‌తో గొడవకు దిగుతున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అనేక దేశాలు గౌరవిస్తున్నాయి. ఇది ట్రంప్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వీళ్లే కాకుండా ఇంకా చాలా మంది నిపుణులు ట్రంప్ వైఖరిని వ్యతిరేకిస్తూ భారత్‌కు మద్దతుగా నిలబడుతున్నారు.

Exit mobile version