NTV Telugu Site icon

Andhra Pradesh: దంచికొడుతున్న ఎండలు.. ఏప్రిల్‌ను మరిపిస్తున్న ఫిబ్రవరి..!

Weather

Weather

Andhra Pradesh: ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి.. సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో.. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. సార్వసాధారణంగా.. ఏప్రిల్‌లో నమోదు అయ్యే ఎండలు.. ఫిబ్రవరి రెండో వారంలోనే సుర్రుమనిపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ఇక, ఈ నెల 16వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవవకాశం ఉందని.. ఈ వేసవి మరింత హీట్‌ పెంచుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఫిబ్రవరిలో పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీలకు మించకుండా ఉంటాయి.. కానీ, ఈ ఏడాది ఇప్పటికే 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి..

Read Also: Hero MotoCorp : భారీ లాభాల్లో హీరో మోటో కార్ప్.. ఒక్కో షేరుకు రూ.100డివిడెండ్ ప్రకటన

ఏపీలో గడిచిన రెండు మూడు రోజులుగా పరిశీలిస్తే.. రాయలసీమ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. కర్నూలులో 38.5 డిగ్రీలు, అనంతపురం, నంద్యాల, కడప జిల్లాలో 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నాయి.. ఇవి కూడా సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో.. ఏప్రిల్‌, మే నెలల్లో మరింత తీవ్రమైన ఎండలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వేసవి తాపంతో పాటు తీవ్ర వడగాడ్పులు కూడా ఉంటాయని, కొన్ని రోజులు అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయంటున్నారు.. పసిఫిక్‌ మహా సముద్రంలో బలంగా ఉన్న ఎల్‌నినోతో పాటు ఆకా­శంలో మేఘాలు తక్కువగా ఉండట, కా­లు­ష్య కారక వాయువులు ఉపరితలంలోకి వెళ్లకుండా పొగమంచు అడ్డుకోవడం వంటివి ప­గటి ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణం అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.. ఇక, ఎండల తీవ్రతతో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తు్న్నారు. మరోవైపు.. వేసవి తాపంతో.. క్రమంగా విద్యుత్‌ డిమాండ్‌ కూడా పెరిగిపోతోంది.