NTV Telugu Site icon

Skin Diseases: వాయు కాలుష్యంతోనే చర్మ వ్యాధులు.. డేంజర్ అంటున్న నిపుణులు..!

Skin

Skin

విషపూరితమైన గాలి, ఆహారపు అలవాట్ల కారణంగా చర్మ సమస్యలు వస్తాయి. వాతావరణ కాలుష్యం కారణంగా.. శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో దురద కలిగించే చర్మ వ్యాధి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే శరీరంలో దురద, అలర్జీ లాంటివి అనిపిస్తే వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. చర్మంపై ఎర్రటి మచ్చలు, దద్దుర్లు ఉంటే దానిని ఉర్టికేరియా అని అంటారు.

ఉర్టికేరియాతో బాధపడేవారి చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపించడంతోపాటు దురద కూడా మొదలవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చెడు ఆహారపు అలవాట్లు, వాయు కాలుష్యం ఈ వ్యాధికి కారణమని చెబుతున్నారు. ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చని తెలుపుతున్నారు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే…. ఈ వ్యాధికి చర్మ వ్యాధులు, చెడు ఆహారపు అలవాట్లతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఈ వ్యాధిలో మొదట చర్మంపై దురద, దద్దుర్లు కనిపించడం జరుగుతుంది. దాని వలన చర్మంపై దురద మొదలవుతుంది. ఇది మరీ ఎక్కువై ఇబ్బంది పెడితే తప్పకుండా ఒకసారి డాక్టర్ ని సంప్రదించండి.

Trent Boult: కివీస్ స్టార్ బౌలర్ అరుదైన ఘనత.. తొలి బౌలర్గా రికార్డు..!

వ్యాధి కాలుష్యానికి సంబంధించినదా?
మీకు ఇప్పటికే ఏదైనా అలర్జీ ఉంటే.. వాయుకాలుష్యంతో కలిసిపోవడం వల్ల అది పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందువల్ల మాస్క్ ధరించడం, ఎక్కువగా నీరు త్రాగాలి. దాంతో మీ శరీరంలోని అవయవాలకు ఎలాంటి హాని కలగదు.

జన్యు సమస్య
ఈ వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉన్నట్లైతే.. మిగతా సభ్యులకు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు వైద్యుడిని సంప్రదించడం మేలు.