NTV Telugu Site icon

Nani : సరిపోదా శనివారం బర్త్ డే గ్లిమ్స్ …సరిపోయిందా..?

Untitled Design (8)

Untitled Design (8)

నేచురల్ స్టార్  నాని హీరోగా , ప్రియాంక మోహన్ హీరోయిన్ గా , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ నాట్ ఏ టీజర్ విడుదలైంది. గతంలో విడుదలైన పోస్టర్ల నుండి గ్లింప్సెస్ నుండి పాటల వరకు, ఈ  సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

నేడు SJ సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘దిస్ ఈజ్ నాట్ ఏ టీజర్’ అనే టీజర్ ను విడుదల చేసింది నిర్మాణ సంస్థ. నాని వాయిస్‌ఓవర్‌లో  ‘నీడలాంటి చెడు ఎప్పుడైతే బలపడుతుందో, దానిని ఆపడానికి కొన్ని సమానంగా లేదా మరింత శక్తివంతంగా మంచి పుడుతుంది’. శక్తి లేని వ్యక్తులపై తన ఆధిపత్యాన్ని చూపించే క్రూరమైన పోలీసుగా SJ సూర్యను పరిచయం చేశారు. శ్రీకృష్ణుడు (నాని) తన సత్యభామ (ప్రియాంక మోహన్)తో కలిసి రావణాసురుడు (SJ సూర్య)ను ఎదుర్కోవడానికి వస్తాడని అర్ధం వచ్చేలా కట్ చేసిన టీజర్ స్టార్టింగ్ నుండి చివరి వరకు ఆధ్యంతం ఆకట్టుకుంది. SJ సూర్య క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గా, నాని తన బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో . ఇద్దరూ తమ అద్భుతమైన మరియు పవర్-ప్యాక్డ్ యాక్టింగ్ తో టీజర్ ను రక్తికట్టించారు.

వివేక్ ఆత్రేయ కథలు ఎప్పుడు సరికొత్తగా, వైవిధ్య భరితంగా ఉంటాయి. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన ‘అంటే సుందరానికి’ నిరాశపరచడంతో ఈ చిత్రంతో స్ట్రాంగ్ కామ్ బ్యాక్ ఇచ్చేలా ప్లాన్ చేసాడు దర్శకుడు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

 

Also Read: December clash: డిసెంబర్ దంగల్..రేసులో ఉండేది ఎవరు తప్పుకునేది ఎవరు..?

 

Saripodhaa Sanivaaram - Not a Teaser | Nani | Priyanka | SJ Suryah | Vivek Athreya | DVV Danayya