బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పదో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి.. గత తొమ్మిది నామినేషన్స్ కన్నా ఇది పరమ చెత్తగా ఉందనే టాక్ ను సొంతం చేసుకుంది.. నలుగురు అమ్మాయిలు రాజమాతలు చేసి మీకు నచ్చినట్లు నామినేట్ చేసేయండి అంటూ ఆర్డర్ ఇచ్చేశాడు బిగ్బాస్.. ఇక వాళ్లంతా రెచ్చిపోయారు.. వారికి నచ్చిన వారిని మాత్రమే నామినేట్ చేశారు.. ఆ సమయంలో ప్రియాంక, శోభాశెట్టి ప్రవర్తన ఇంటి సభ్యులకు.. ఇటు ప్రేక్షకులకు సైతం చిరాకు తెప్పించింది. వీళ్లు నిజంగానే ఓ రాజ్యానికి రాజమాతలు అన్నట్లుగా బిహేవ్ చేశారు. మొత్తానికి ఈ వారం రతిక, శివాజీ, భోళే, యావర్, గౌతమ్ నామినేట్ అవ్వగా .. సీరియల్ బ్యాచ్ మొత్తం సేవ్ అయ్యింది.
ముఖ్యంగా యావర్ విషయంలో శోభా తన ఇష్టానుసారం చేసేసింది. వేరేవాళ్లను నామినేట్ చేయడానికి తన దగ్గర రీజన్ లేదు అని చెప్పినందుకు నేరుగా అతడినే నామినేట్ చేసింది. మొత్తానికి సీరియల్ బ్యాచ్ మొత్తం ఓ రేంజులో చేశారు.. అంతేకాదు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ను క్షమించాలని అడగాలంటూ రాజమాతగా ఆర్డర్ వేసింది శోభా. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. శోభా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అతనిపై ఇలా చెయ్యడం భావ్యం కాదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
అసలు శోభా ఏం చేసిందంటే.. ‘ఏయ్ ఇటు రా.. నామినేషన్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడుతున్నావ్ ఏంటీ ?. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టి.. క్షమించమని చెప్పు’ అంటూ నిజంగానే మహరాణిలా ఫీల్ అయిపోయింది. ఇక ప్రియాంక అక్కా పక్కనే ఉండి నవ్వుతూ తెగ ఎంజాయ్ చేసింది. ప్రశాంత్ స్థానంలో అమర్ ఉండి పెద్ద యుద్ధమే చేసేది ప్రియాంక.. శోభాకు చెప్పాల్సిన ప్రియాంక నవ్వుతూ ఉండిపోయింది.. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో శోభాకు అహంకారం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రశాంత్ ఫ్యాన్స్. ముందు నుంచి హౌస్ లో శోభా తన వింత ప్రవర్తనతో చిరాకు తెప్పిస్తోంది సోభా. మొన్నటి ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో శోభా రియాక్షన్ గురించి చెప్పక్కర్లేదు.. ఇక రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..