గాయం కారణంగా దాదాపు ఐదు నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. గతేడాది సెప్టెంబర్‌లో మోకాలి గాయంతో టీమ్‌కు దూరమైన ఇతడు.. ఎంతో కీలకమైన వరల్డ్‌కప్‌లోనూ ఆడలేకపోయాడు. తాజాగా గాయం నుంచి కోలుకున్న జడ్డూ..ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఐదు నెలల ప్రయాణం గురించి జడ్డూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ క్రమంలోనే కాస్త ఎమోషనల్ అయ్యాడు.
Also Read: Balakrishna: నర్సులపై చేసిన వ్యాఖ్యల దుమారం.. వక్రీకరంచారంటూ బాలయ్య వివరణ
“నా కెరీర్‌లో ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. టీవీలో మ్యాచ్ చూసినప్పుడల్లా తానూ ఆడితే బాగుండేదని ఫీలయ్యే వాడిని. క్రికెట్ అకాడమీలోని ఫిజియోలు, ట్రైనర్స్ సహాయ సహకారాల వల్లే తాను తొందరగా తిరిగి మైదానంలో అడుగు పెట్టగలిగాను. సెలవు రోజుల్లో కూడా నా కోసం వారు చాలా కష్టపడ్డారు, ప్రస్తుతం మైదానంలో బరిలో దిగడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా” అని జడేజా చెప్పుకొచ్చాడు.
Also Read: Sohail Khan: కోహ్లీ కంటే రోహిత్ గొప్ప బ్యాటర్: పాక్ మాజీ పేసర్
గాయం నుంచి కోలుకున్న జడేజా రంజీ ట్రోఫీలో పాల్గొని ఫిటెన్‌స్‌ను నిరూపించుకున్నాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసి బౌలింగ్‌లో సత్తా చాటాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం విఫలమయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో జడేజాకు చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.