విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ప్రస్తుత తరంలో టీమిండియాకు దొరికిన అద్భుత బ్యాటర్లు. ఎన్నో సందర్భాల్లో వీరిద్దరూ జట్టును ఒంటిచేత్తో గెలిపించారు. అలాగే జట్టును ముందుండి నడిపించారు. బ్యాటింగ్ రికార్డుల్లో ఎవరి ఘనతలు వారివే. ఇద్దరూ గొప్ప రికార్డులే సృష్టించారు. అయినప్పటికీ వీరిద్దరిలో ఎవరు గొప్ప బ్యాటర్ అనే ప్రశ్న ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. దీనిపై ఎవరి ఫ్యాన్స్ సమాధానం వారిది. కొందరు మాజీలు కూడా ఇదే ప్రశ్నపై విభిన్న సమాధానాలు చెప్పారు. తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ సోహైల్ ఖాన్‌కు ఈ ప్రశ్న ఎదురవగా.. కోహ్లీ కంటే రోహిత్ బెస్ట్ బ్యాటర్ అంటూ కుండబద్దలు కొట్టాడు.
Also Read: Kangana Ranaut: నాపై గూఢచర్యం చేస్తున్నారు.. రణ్‌బీర్‌పై కంగనా బాంబ్
దశాబ్ద కాలంగా ప్రపంచ క్రికెట్‌లో రోహిత్ శర్మ తనదైన ముద్ర వేశాడని పేర్కొన్నాడు సోహైల్. కోహ్లీ కూడా మంచి ఆటగాడేనని, అతడి ఆటతీరును తాను గౌరవిస్తానని అన్నాడు. కానీ ఓ బౌలర్‌గా మాత్రం కోహ్లీ కంటే రోహిత్ మంచి బ్యాటర్‌గా తాను భావిస్తున్నట్లు చెప్పాడు. రోహిత్ బ్యాటింగ్ టెక్నిక్ వైవిధ్యంగా ఉంటుందని పేర్కొన్నాడు. తొందరపాటుతో కాకుండా బౌలింగ్ శైలిని అర్థం చేసుకుంటూ అతడు పరుగులు చేసే తీరు అద్భుతమని సోహైల్ కొనియాడాడు.
Also Read: Bihar Railway Track: బిహార్‌లో మరో వింత ఘటన.. రైల్వే ట్రాక్ దొంగలించిన దుండగులు
ఫిట్‌నెస్‌పై ఆధారపడి కోహ్లీ భారీ స్కోర్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని సోహైల్ ఖాన్ తెలిపాడు. కోహ్లీ ఓ సింగిల్ తీసిన తర్వాత మరోసారి అదే ప్రయత్నం చేస్తుంటాడని, కానీ రోహిత్ ఓ సింగిల్ తర్వాత బ్యాట్‌కు పనిచెబుతూ భారీ షాట్ ఆడేందుకు ట్రై చేస్తాడని చెప్పాడు. కోహ్లీ, రోహిత్‌లను కంపేర్ చేస్తూ సోహైల్ చేసిన ఈ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.