ఎక్సైజ్ అధికారులు దులో పేట్ లోని ఆ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.. ఇంటి వాళ్ళందరూ ఎలాంటి ఐరానా పడకుండా ప్రశాంతంగా కూర్చున్నారు.. అందులో ఒకరు పూజ గదిలోకి వెళ్లి బ్రహ్మాండమైన పూజలు చేస్తున్నాడు.. అప్పటికి అధికారులకు అర్థం కాలేదు.. ఇల్లు మొత్తం వెతికినప్పటికీ ఎక్కడ కూడా గంజాయి ఆనావాళ్లు దొరకలేదు.. అరవీర భయంకరంగా పూజలు చేస్తున్న వ్యక్తిని అనుమానంగా చూశారు.. అప్పుడే అనుమానం వచ్చి అధికారులు పూజా గదిలోకి వెళ్లారు.
Also Read:Pune: పూణె అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. యువతికి అది ఇష్టం లేకనే..!
అప్పుడు అతని ముఖ కవళికలో మార్పు వచ్చింది. పూజగది మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఎలాంటి గంజాయి ఆనవాళ్లు దొరకలేదు.. ఎందుకో అనుమానం వచ్చి దేవుళ్ళ చిత్రపటాలను పక్కకు కొద్దిగా జరిపి చేశారు.. పేపర్ తో చుట్టబడిన బండిల్స్ కనపించాయి.. అవి ఏంటి అని చూస్తే అందులో గంజాయి ఉంది.. దేవుళ్ల చిత్రపటాల వెనకాల గంజాయి పెట్టి పూజలు చేస్తున్న రోహన్ సింగ్. గంజాయి దందా చేస్తున్న రోహన్ సింగ్ ని చివరికి ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దూల్ పేట కేంద్రంగా నడుస్తున్న ఈ దందాను చివరికి ఎక్సైజ్ అధికారులు బట్టబయలు చేశారు.. మరోవైపు ఒడిస్సా నుంచి పెద్ద మొత్తంలో గంజాయి తీసుకొచ్చి రెండు ప్రాంతాల్లో పూజ గదిలో చిత్రపటాల వెనకాల నిలువచేసిన ఇద్దరిని అరెస్టు చేశారు. దేవుళ్ల పటాల వెనుక మత్తు మాయ.. పూజగదిలో దేవుడి చిత్ర పటాల వెనుక గంజాయి ప్యాకెట్లు.. పూలతోపాటు గంజాయినీ దేవుడికి సమర్థిస్తున్న దూల్ పేట డ్రగ్స్ మాఫియా.. ఒరిస్సా నుంచి వచ్చిన మత్తు గంజాయినీ హైదరాబాద్‌లో చాకచక్యంగా దాచిన గంజాయిని ఎక్సైజ్ పోలీసులు బయటకు తీశారు.. ఇది దేవుళ్ల ముందు నాటకం కాదు… మత్తులో మునిగిపోయిన గుట్టు రట్టు చేశారు.. ఇది హైదరాబాద్ దూల్‌పేట్ ఇందిరానగర్‌లోని ఓ ఇంట్లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సోదాలు జరిపారు.
Also Read:UP: యూపీలో ఘోరం.. గోడను ఢీకొట్టిన కారు.. వరుడు సహా 8 మంది మృతి
ఇంటినంతా వెతికినా దొరకని గంజాయి .. చివరికి… పూజ గదిలోని దేవుళ్ల ఫోటోల వెనుక దాగి గంజాయినీ పేపర్లో చుట్టిన బండిల్‌లను చూస్తే ఆశ్చర్యపోయిన పోలీసులు… అవి ఓపెన్ చేసి చూడగానే మత్తు ప్యాకెట్ల గుట్టు బయట పడింది..ఇక్కడి నుండే 10 కేజీల గంజాయి బయటపడింది. రోహన్ సింగ్, యశ్వంత్ సింగ్ అరెస్ట్. ఈ ముఠా గంజాయిని ఒరిస్సా నుంచి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయిని 5 ,10, 15, 20 గ్రాముల్లో చిన్న ప్యాకెట్లను తయారు చేస్తారు. అలా తయారుచేసిన గంజాయి ప్యాకెట్లను గచ్చిబౌలి మాదాపూర్ తోపాటు ఐటి ఏరియాలో ఉన్న తమ ఏజెంట్లకు సరఫరా చేస్తారు. అక్కడ గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతాయి.. ఇదేరోజు శివలాల్ నగర్‌లో మరోసారి సోదాలు నిర్వహించారు.
Also Read:Iswarya Menon : కొబ్బరి బోండంతో వలపువల విసురుతున్న ఐశ్వర్య మీనన్
సంకీర్ సింగ్, సుశీల్ సింగ్, సరిత, ఒరిస్సా చెందిన స్వప్న మండల్ అలియాస్ మీనా బాయ్ నుంచి 10 కేజీల గంజాయి పట్టుబడింది. ఇవాళ ఒక్కరోజే రెండు కేసుల్లో 21.334 కేజీల గంజాయి, విలువ సుమారు 22 లక్షలు..ఇదంతా బలరాం గల్లీ ప్రాంతంలోని ఇంటి నెంబర్ పవన్ సింగ్ ఇంట్లో దాడి చేశారు. ఇక్కడ కూడా ఇదే తరహా లో 2 కేజీల గంజాయి దొరికింది. ఈ కేసులో కౌశిక్ సింగ్, శ్వేతా బాయ్, అఖిలేష్, దుర్గ భవాని, మనో సింగ్ అరెస్ట్ అయ్యారు. మత్తు ముఠాలకు రూపం మారినా… పేర్లు మారినా… పద్ధతులు కొత్తైనా… ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయట్లేదు. విక్రమార్కుల్లా వేట సాగుతోంది… దేవుళ్ల పటాల వెనుక దాచిన మత్తు మాయను మట్టుపెట్టే ప్రయత్నమే ఇదన్నట్టు..ఇలాంటి మత్తు ముఠాలకు బలయ్యే వాళ్లు కొందరే అయినా… సమాజం మొత్తం పాడవుతుంది. ఇంకా ఎవరు దాగున్నారు? ఎవరి ఇంట్లో మత్తు దాచారు? ఇది మొదటి దాడే కావచ్చు చివరిది కాదేమో..
