పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి ముగ్గురిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు పాల్పడిన ఆల్ ఖైదా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ. కిడ్నాప్ కు గురైన వారిలో ఏపీకి చెందిన అమరలింగేశ్వర్ రావు ఉన్నారు. అమరలింగేశ్వర్రావు స్వగ్రామం జమ్మలమడక, మాచర్ల మండలం, పల్నాడు జిల్లా. మిర్యాలగూడలో నివాసం ఉంటున్న అమరలింగేశ్వర భార్య రమణ, పిల్లలు.. రెండు నెలల క్రితమే తన కుటుంబాన్ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేశాడు అమరలింగేశ్వరరావు.
Also Read:Drone Camera: ఫ్లైఓవర్‌పై ఫొటోషూట్.. యువకులను పట్టించిన డ్రోన్ కెమెరా..!
ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడంతో అమరలింగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అమర లింగేశ్వర రావు భార్య రమణ హైదరాబాద్ కు చేరుకున్నారు. బందీగా ఉన్న తన కొడుకును విడిపించాలని తండ్రి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 15 సంవత్సరాలుగా మాలీ లో పనిచేస్తున్న అమరలింగేశ్వరరావు. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.