Site icon NTV Telugu

Kollu Ravindra: “త్వరలో అతిపెద్ద తిమింగలం”.. లిక్కర్‌ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు..

Minister Kollu Ravindra

Minister Kollu Ravindra

ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో త్వరలో అతి పెద్ద తిమింగలం బయటకొస్తుందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటికి వచ్చాయి.. అన్ని ఆధారాలతో త్వరలో పెద్ద తిమింగళం బయట పడుతుందన్నారు. గతంలో అడ్డంగా దోచుకుని జేబులు నింపుకొన్నారని ఆరోపించారు. కూటమి వచ్చాక 500 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యానికి కళ్లెం వేశామని తెలిపారు. రాష్ట్రంలో తక్కువ దొరకే నాణ్యమైన మద్యం అందుతుందన్నారు. రాష్ట్రంలో మద్యంతో పాటు ఇంకా అనేక కుంభకోణాలు బయటికి వస్తున్నాయని చెప్పారు.

READ MORE: Tammineni Sitaram: మిథున్ రెడ్డి అరెస్టుపై స్పందించిన తమ్మినేని సీతారాం..

ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ సుదీర్ఘంగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు.. విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించకపోవటంతో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ మేరకు మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఈ కేసులో అరెస్టైన తొలి ప్రజాప్రతినిధి మిథున్‌రెడ్డి.

Exit mobile version