NTV Telugu Site icon

Exercise:వర్షాకాలంలో వాకింగ్ చేయడం కుదరడం లేదా? ఇంట్లోనే ఇలా ఎక్సర్‌సైజ్‌ చేసుకోండి

Excercise Copy

Excercise Copy

Exercise at Home : వానాకాలం మొదలైంది అంటే ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు. జాగింగ్ కి వెళ్లేటప్పుడే చినుకులు పడొచ్చు, జిమ్ కి పోదామా అంటే కుంభవృష్టి కురవొచ్చు. అలా అని బద్దకంగా ఇంట్లో పకోడిలు, మిర్చీబజ్జీలు తింటూ కూర్చుంటే లావు పెరగడం ఖాయం. అందుకే ఇంట్లోనే ఎక్సర్‌సైజ్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. బరువు తగ్గించుకొనే చాలా ఎక్సర్‌సైజ్‌లు ఇంట్లోనే చేసుకోవచ్చు. యోగా ఒక మంచి ఎక్సర్‌సైజ్‌ దీని కోసం ఆరుబయటకు వెళ్లాల్సిన పనిలేదు. యోగా చేయడానికి ఒక బెడ్ షీట్ సరిపోతుంది. స్కిప్పింగ్‌కు తాడుతో కూడా బరువు తగ్గే వ్యాయామాలు చేయవచ్చు.

అంతేకాకుండా ట్రెడ్‌మిల్‌, స్పిన్‌ సైకిల్‌ లాంటి వాటిని నెలవారీగా అద్దెకిచ్చే సంస్థలు కూడా ఉంటాయి. కావాలంటే ఈ వర్షాకాలం వరకు వాటిని తీసుకోవచ్చు. ఇకపోతే మాకు జాగింగ్ అంటేనే ఇష్టం ఇవన్నీ మేం చేయలేం అంటారా ఉన్న చోటనే జాగింగ్‌ చేసుకునే టెక్నిక్స్‌ చాలానే ఉన్నాయి. వాటి కోసం ఆన్ లైన్, కావాలంటే యూట్యూబ్ వీడియోలు చూడండి. ఇక పుషప్స్‌కు ఎలాంటి సాధనమూ అవసరం లేదు. గుర్తుంచుకోండి నాలుగు గోడల మధ్య చేసే వ్యాయామం కూడా ఆరుబయట చేసే కసరత్తులతో సమానమైన ఫలితాలను ఇస్తుంది.

Also Read: Hair fall: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల బరువుతగ్గే ప్రయోజనం మాత్రమే కాకుండా ఇంకా అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి. రోజు వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడి దూరం అవుతంది. అంతే కాకుండా ఎక్సర్‌సైజ్‌ ద్వారా డిప్రెషన్ కూడా అధిగమించవచ్చు. కండరాలు, ఎముకలు బలపడతాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. ఉదయం పూట వ్యాయామం చేస్తే ఆరోజంతా కూడా చాలా యాక్టివ్ గా ఉంటాము. అందుకే వానలు అని సాకు చెప్పకుండా వీలైనంత వరకు ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి.