Site icon NTV Telugu

Vizag Crime: విశాఖలో మాజీ సైనికుడి దారుణ హత్య

Vizag

Vizag

Vizag Crime: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్‌ వద్ద వికలాంగుడు అయినా మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేటాడి వెంటాడి మరి అతి దారుణంగా కత్తులతో నరికి చంపేశారు. మృతి చెందిన వ్యక్తి మాజీ సైనికుడు అప్పలనాయుడుగా గుర్తించారు పోలీసులు. స్థల వివాదంలో తరచూ గొడవలు జరుగుతుందడంతో హత్యకు స్కెచ్ వేసి ప్లాన్ ప్రకారం దుండగులు హత్య చేశారు. హత్య చేసిన అనంతరం పోలీసులకు లొంగిపోయారు. హత్య చేయించారా లేదంటే చేశారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఈ హత్యా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్‌ను చంపుతానని బెదిరించిన కేసులో యూట్యూబర్కు బెయిల్..

Exit mobile version