సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి బలహీనపడుతున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా వెళ్లిపోవడం పార్టీని కలవరపెడుతోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరి రాజ్యసభ సీటు సంపాదించుకున్నారు. అదే బాటలో మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి (Lal Bahadur Shastri) మనవడు విభాకర్ శాస్త్రి (Vibhakar Shastri) కూడా చేరారు. తాజాగా ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేసి బీజేపీ (BJP)లో చేరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్)లో తెలియజేశారు.
కాంగ్రెస్‌కు రాజీనామా అనంతరం విభాకర్ శాస్త్రి బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశానికి తవంతు కృషి చేస్తానని విభాకర్ తెలిపారు.
