Site icon NTV Telugu

Karnataka: దేవెగౌడ మనవడిపై లైంగిక ఆరోపణలు.. సిట్ విచారణ..!

Karnataka

Karnataka

కర్ణాటక రాష్ట్రంలోని హాసన్‌ పార్లమెంట్ సిటింగ్‌ ఎంపీ, జేడీఎస్‌ నాయకుడు ప్రజ్వల్‌ రేవణ్ణపై వస్తున్న అశ్లీల పెన్‌డ్రైవ్‌ ఆరోపణలపై కర్ణాటక సర్కార్ ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఏడీజీపీ బీకే సింగ్‌ నేతృత్వంలో సిట్‌ విచారణ చేస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌ ప్రకటించారు. కాగా, అశ్లీల వీడియోల అంశం తీవ్ర దుమారం రేపుతున్న సమయంలోనే ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీలోని ఫ్లాంక్‌ఫర్ట్‌కు వెళ్లిపోవడంతో అనేక అనుమానాలకు దారి తీస్తోంది.

Read Also: Shamshabad Airport: కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత.. బోన్ లో మేక ను ఉంచి..

అయితే, ఈ విషయంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. ప్రజ్వల్‌ దేశం విడిచి పారిపోవడం సిగ్గు చేటు అన్నారు. సిట్‌ విచారణలో భాగంగా ఆయన్ని వెనక్కి తీసుకు వచ్చి ఎంక్వైరీ చేస్తామని హోంమంత్రి పరమేశ్వర్‌ పేర్కొన్నారు. మరోవైపు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించి పలు వీడియోలు ప్రస్తుతం రాష్ట్రంలో వైరల్‌ అవుతున్నాయి. ప్రజ్వల్‌ రేవణ్ణ పలువురు మహిళలతో అశ్లీలంగా ఉన్న వీడియోలు వెలుగులోకి రావడంతో.. బాధిత మహిళలు తమకు న్యాయం చేయాలని టీవీ ఛానళ్లు, మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రజ్వల్‌ అశ్లీల వీడియోలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగలక్ష్మి చౌదరి సీఎం సిద్ధరామయ్యను కోరారు.

Read Also: Priyanka Jawalkar: సమ్మర్ హీట్ మరీఇంత పెంచుతున్న ప్రియాంక జవాల్కేర్ అందాలు…

కాగా, తన ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు కావాలని మార్ఫింగ్‌ వీడియోలను ప్రచారం చేశారని ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వెల్లడించారు. ఇదిలా ఉండగా, లైంగిక వేధింపులు, నిర్బంధం ఆరోపణలపై మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, హాసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై ఆదివారం నాడు హోలినరసిపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఫిర్యాదు చేసిన వ్యక్తి రేవణ్ణ సతీమణి భవాని బంధువుగా తెలిపింది. తాను వంట మనిషిగా పని చేయడం ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత రేవణ్ణ తనను వేధించా, ఆయన కుమారుడు ప్రజ్వల్‌ తన కుమార్తెకు వీడియో కాల్స్‌ చేసి అసభ్యంగా మాట్లాడేవారని ఆమె ఆరోపణలు చేసింది.

Exit mobile version