NTV Telugu Site icon

Ashok Tanwar: మాజీ ఎంపీ జిమ్మిక్కు.. గంట క్రితం బీజేపీ ర్యాలీలో.. కట్‌చేస్తే.. వేదికపై రాహుల్ గాంధీతో..

Ashok

Ashok

దాదాపు గంట క్రితం ఓ ర్యాలీలో పాల్గొని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థులకు ఓట్లు వేయాలని అడిగిన నాయకుడు కట్‌చేస్తే కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీతో ప్రత్యక్షమయ్యారు. ఆయన పేరు అశోక్ తన్వర్. ఒక్కగంటలోనే పార్టీని వీడి కాంగ్రెస్‌వాదిగా మారారు. హర్యానా ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు అశోక్ తన్వర్ రాహుల్ గాంధీ జింద్ ర్యాలీకి చేరుకున్నారు.

READ MORE: Delhi Drug Case: రూ. 5000 కోట్ల డ్రగ్స్ కేసు.. ప్రధాన సూత్రధారితో కాంగ్రెస్‌కి సంబంధం..

సిర్సా మాజీ ఎంపీ అశోక్ తన్వర్ గురువారం మహేందర్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, భూపిందర్ సింగ్ హుడా సమక్షంలో తన్వర్ తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఒకప్పుడు హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తన్వర్ 2019లో పార్టీ పతనం తర్వాత రాజీనామా చేశారు. ఆయన ఏప్రిల్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి మారడానికి ముందు నవంబర్ 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సంవత్సరం ప్రారంభంలో.. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని , “పరివర్తన”ను ప్రశంసించారు.

READ MORE:Stock market: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం.. భారత్ స్టాక్ మార్కెట్ల భారీ పతనం..

జింద్ జిల్లాలోని సఫిడాన్‌లో బీజేపీ అభ్యర్థికి తఫున ప్రచారం చేసిన కొన్ని గంటలకే తన్వర్ కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించినప్పుడు.. వేదికపై నుంచి ప్రేక్షకులను కొన్ని నిమిషాలు వేచి ఉండమని కోరుతూ ప్రకటన వెలువడింది.
వెంటనే.. తన్వర్ వేదికపైకి వచ్చారు. ” ఆజ్ ఉంకీ ఘర్ వాప్సీ హో గయీ హై (నేడు, అతను తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నాడు)” అని రాహుల్ గాంధీ ప్రకటించారు.

Show comments