Divya Pahuja: గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో 27 ఏళ్ల మోడల్ దివ్య పహుజా హత్య ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దివ్య పహుజా బల్దేవ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. సంచలనం సృష్టించిన హత్య కేసులో ఢిల్లీకి చెందిన అభిజీత్ అనే వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజమాని అభిజీత్ తన సహచరులతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డారని, ఆపై దివ్య మృతదేహాన్ని మాయం చేయడానికి అతని సహచరులకు రూ.10 లక్షలు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. అభిజీత్‌తో సహా హత్య నిందితులు దివ్య మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి నీలిరంగు బీఎమ్‌డబ్ల్యూ కారులో ఘటనా స్థలం నుంచి పారిపోవడం సీసీటీనీ ఫుటేజీలో కనిపించింది.
Read Also: Aukat Remark: డ్రైవర్ స్థాయి గురించి ప్రశ్నించినందుకు!.. కలెక్టర్‌పై బదిలీ వేటు
జనవరి 2న హోటల్ రిసెప్షన్‌కు అభిజీత్, యువతి, మరొక వ్యక్తి వచ్చి గది నంబర్ 111కి వెళుతున్న దృశ్యం మొత్తం సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయ్యింది. ఆ తర్వాత అదే రాత్రి అభిజీత్‌తో పాటు మరికొందరు దివ్య మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి లాగడం కనిపించింది. గురుగ్రామ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన అనేక బృందాలు పంజాబ్, ఇతర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని కనుగొని నిందితులను అరెస్టు చేశారు.దివ్య కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అభిజీత్‌తో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు. 2016 నాటి గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ఎన్‌కౌంటర్ కేసులో దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు కావడం గమనార్హం. దివ్య కుటుంబం అభిజీత్‌తో కలసి గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ సోదరి సుదేష్ కటారియా, అతని సోదరుడు బ్రహ్మ్ ప్రకాష్ కలిసి ఆమె హత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దివ్య కుటుంబం ఫిర్యాదు చేసింది.
Read Also: PM Modi: మహిళా శక్తికి కృతజ్ఞుడను.. కేరళలోని త్రిసూర్‌లో ప్రధాని మోడీ ప్రసంగం
2016లో ముంబైలో జరిగిన వివాదాస్పద ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ స్నేహితురాలు దివ్య కూడా ఆ సమయంలో పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ఆరోపణలు ఎదుర్కొంది. గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మోడల్‌కు గతేడాది జూన్‌లో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 6, 2016న ముంబైలోని ఓ హోటల్‌లో గడోలీపై జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్‌లో దివ్య, ఆమె తల్లి, ఐదుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు. బెయిల్ పొందే ముందు దివ్య దాదాపు ఏడేళ్ల పాటు జైలులో ఉన్నారు.