అనంతపురం జిల్లా ఉరవకొండ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంటుంది. రెండు రోజుల క్రితం ఉరవకొండ పట్టణంలో విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో జరిగిన ఘర్షణ కారణంగా ఈ గొడవ మరింత రాజుకుంది. వీరి కుటుంబంలో రెండు వర్గాలు ఉండగా గత ఎన్నికల్లో తన తండ్రి విశ్వేశ్వరరెడ్డి ఓటమికి విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి, మరో సోదరుడి కుమారుడు నిఖిల్ నాథ్ రెడ్డి కారణమని, ప్రత్యర్థి నాయకులతో కలిసి డబ్బులు తీసుకొని తమని ఓడించారని ఆరోపణలు వచ్చాయి.
వాటికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ విశ్వేశ్వరరెడ్డి తనయుడు వైసీపీ యువజన విభాగం నాయకుడు ప్రణయ్ రెడ్డి అనుచరులతో, వారి కుటుంబ సబ్యులతో ప్రచారం చేసాడని నిఖిల్ నాథ్ రెడ్డి అన్నాడు..అతని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపమని అడగడానికి పట్టణంలో ఉన్న వారి ఇంటికి వెళ్లగా అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. ఆ సందర్భంలో ధనరాజ్ అనే వ్యక్తికి తగలడంతో తరువాత ఫోన్ చేసి అతనికి క్షమాపణ చెప్పడం జరిగిందని నిఖిల్ నాథ్ రెడ్డి అన్నారు. కేవలం తమ ఎదుగుదలను చూడలేకే తనపై, తన తమ్ముడు అనుచరులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. మా తాత భూ పోరాటం చేసి పేదలకు భూములు పంచితే విశ్వేశ్వరరెడ్డి కొడుకు పేదల భూములు లాక్కొని కబ్జాకి పాల్పడుతున్నారని నిఖిల్ నాథ్ రెడ్డి ఆరోపించారు.
NBK108: నిర్మాణంలో భాగం కానున్న ఆ నిర్మాత..?