Site icon NTV Telugu

Prasanna Kumar Reddy: నా ఇంటిని టీడీపీ నేతలే విధ్వంసం చేశారు.. ప్రతి విమర్శకు నేను కట్టుబడి ఉన్నా..!

Prasanna Kumar Reddy

Prasanna Kumar Reddy

Prasanna Kumar Reddy: నా ఇంటిని టీడీపీ నేతలే విధ్వంసం చేశారని చెబుతన్నారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఆయన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేయడం.. ఆ తర్వాత నెల్లూరులోని ఆయన నివాసంపై దాడి, విధ్వంసం జరిగిన విషయం విదితమే కాగా.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రసన్నకుమార్‌ రెడ్డి.. జిల్లా చరిత్రలో ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.. అయితే, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడం వల్లే నేను కౌంటర్ ఇచ్చాను అన్నారు.. అంతేకాదు, ప్రశాంతి రెడ్డి మీద చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు..

Read Also: Bihar: బీజేపీ నేత ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు ఎన్‌కౌంటర్

ఇక, నా ఇంటిని టీడీపీ నేతలు విధ్వంసం చేశారు.. మేం అధికారంలోకొస్తే ఇలాంటి విధ్వంసానికి పాల్పడం.. కానీ, సరైన రీతిలోని బుద్ధి చెబుతాం అన్నారు ప్రసన్న కుమార్‌ రెడ్డి.. అయితే, టార్గెట్ ప్రసన్న కుమార్ రెడ్డి అన్నట్లుగా టీడీపీ నేతలు మా ఇంటి పైన దాడి చేశారు.. ఈ దాడిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడం కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Attack On Ex MLA Prasanna Kumar Reddy Residence | Face To Face | NTV Telugu

Exit mobile version