NTV Telugu Site icon

RK Roja: ఇచ్చిన హామీ ఏమైంది..? పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మౌనం..?

Roja

Roja

RK Roja: విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన బాట పట్టింది.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు.. ఇలా పలు రకాలుగా ఆందోళన నిర్వహించారు.. ఇక, తిరుపతి జిల్లాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆర్కే రోజా.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు.. ఎన్నికల హామీలను చంద్రబాబు మర్చిపోయారని దుయ్యబట్టారు.. ఇక, విద్యుత్ ఛార్జీలపై పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ ఏమైంది? అని అంటూ నిలదీశారు.. అసలు కూటమి ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచుతూ పోతుంటూ.. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ అసలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు.. ఏదేమైనా పెంచిన ఛార్జీలు తగ్గించేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..

Read Also: JC Prabhakar Reddy Apologies: వారికి క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. హాట్‌ టాపిక్‌..!

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రజలపై మోపిన విద్యుత్‌ భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు ఆర్కే రోజా.. విద్యుత్‌ చార్జీలు పెంచం.. వీలైతే తగ్గిస్తాం.. అంతేకాదు.. ప్రజల దగ్గర నుంచే విద్యుత్‌ కొనుగోలు చేస్తామని చంద్రబాబు మాట్లాడారు.. కానీ, నేడు కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపిన భారంతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, విద్యుత్‌ ఛార్జీలు పెంచం.. పెంచితే ఒప్పుకోమన్న పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు ఎందుకు ఆపలేకపోతున్నారు.. ఎందుకు సీఎంను నిలదీయలేకపోతున్నారని మండిపడ్డారు రోజా.. ఇక, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన సంచలన వ్యాఖ్యల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..