NTV Telugu Site icon

RK Roja: హోంమంత్రిపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్..

Rk Roja

Rk Roja

RK Roja: రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు న్యాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్మాదులు, నేరస్థులు పేట్రేగిపోతున్నారన్నారు. గుంటూరులో నవీన్ అనే వ్యక్తి అమ్మాయిపై దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. హోం మంత్రి , డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను కక్ష్య సాధింపుకు వాడుతున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులను వేధించడానికి వాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చెప్పేది చేతల్లో శూన్యమని ఆరోపణలు చేశారు. మీ చేతగాని తనం వల్ల విజయవాడలో వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. 74 మందికి పైగా ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఆర్కే రోజా అన్నారు.

Read Also: Ayyanna Patrudu: నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే జగన్ అసెంబ్లీకి రావట్లేదు..

మహిళా హోం మంత్రి అయి ఉండి అసభ్యకరంగా మాట్లాడుతోందని విమర్శించారు. పోలీసులకు హోంమంత్రి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. బద్వేలులో మహిళను హత్య చేస్తే సీఎం చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌లో అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నారన్నారు. ప్రజలు అందరూ కష్టాల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు రియాలిటీ షోలో సంతోషంగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత మంది మహిళలపై అత్యాచారం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇందుకేనా మీకు ఓట్లు వేసింది పవన్ కల్యాణ్‌ అని అడుగుతున్నామన్నారు. మదనపల్లిలో ఫైల్స్ కాలిపోతే స్పెషల్ ఫ్లైట్‌లో పంపిస్తారని.. క్యాబినెట్‌లో మహిళా భద్రత గురించి ఏ రోజైనా చర్చించారా అని అడుగుతున్నామన్నారు.

దిశ చట్టం, మహిళ పోలీస్ స్టేషన్లు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేశారన్నారు. మహిళా పోలీస్ స్టేషన్‌లను, దిశ యాప్‌లను తిరిగి పునరుద్ధరించాలన్నారు. చంద్రబాబు కు ఆడబిడ్డ విలువ తెలియదు, లోకేష్‌కు ఆడ బిడ్డ విలువ తెలియదంటూ ఆర్కే రోజా అన్నారు. మహిళా హోం మంత్రికి ఆడ బిడ్డ ఉంది, పవన్ కళ్యాణ్‌ ఒక ఆడ బిడ్డ తండ్రిగా ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల తల్లిదండ్రులు కంటి మీద కునుకు లేకుండా బాధపడుతున్నారన్నారు. బాలకృష్ణ నియోజకవర్గంలో అత్తాకోడళ్లపై అత్యాచారం చేస్తే కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆడబిడ్డలకు ఈరోజు రక్షణ లేకుండా పోయిందన్నారు. కర్నూలు జిల్లాలో మచ్చు మర్రిలో ఆడబిడ్డను ముక్కలు ముక్కలుగా నరికి వేస్తే ఇప్పటి వరకు పట్టించుకోలేదని మండిపడ్డారు.