NTV Telugu Site icon

Merugu Nagarjuna: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది..

Minister Merugu Nagarjuna

Minister Merugu Nagarjuna

కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.. ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారని అన్నారు. అడ్డగోలుగా దాడులు చేస్తున్నారు.. చంద్రబాబు వైఖరి వలనే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని మేరుగ నాగార్జున తెలిపారు. ఈ దాడులను ఆపాలని ఏనాడూ చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు..? అని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేలు తప్పుదారిలో నడిస్తే చర్యలు తీసుకున్నారు.. చంద్రబాబు హయాంలో ప్రత్యర్థులు కదిలినా, మెదిలినా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.

Read Also: IND vs BAN: వర్షం లేకపోయినా.. మూడో రోజు ఆట రద్దు!

ఏకంగా సీఎం చంద్రబాబే మక్కెలు విరగ్గొడతానంటూ మాట్లాడటం దేనికి సంకేతం?.. మూడు నెలల్లోనే ఇంతటి దారుణాలకు ఎవరు బాధ్యులు? అని మేరుగ నాగార్జున అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు దాడులు చేయటానికి చంద్రబాబు లైసెన్సులు ఇచ్చేశారు.. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారశైలికి నిరసనగా సొంత పార్టీ వారే ధర్నాలు చేశారు.. తనను వ్యతిరేకించే వారిని ఇంటికొచ్చి కొడతానంటున్న కొలికిపూడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని దుయ్యబట్టారు. కాకినాడలో ప్రొఫెసర్ మీద ఎమ్మెల్యే నానాజీ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రశ్నించారు. ఇంకో ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఏకంగా అంబేద్కర్ ఫ్లెక్సీనే తొలిగిస్తే ఏం చర్యలు తీసుకున్నారు..? అఖిలప్రియ దాడులకు పాల్పడితే ఏం చేశారు?.. కోట్ల సూర్యప్రకాషరెడ్డి వాల్మీకి కులస్తులపై దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు?.. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అరాచకాలపై ఏం చర్యలు తీసుకున్నారు?.. ఇన్ని దారుణాలు మీ ఎమ్మెల్యేలే చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు?.. ఇవే పరిస్థితులు కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మేరుగ నాగార్జున తెలిపారు.

Read Also: Tirumala Laddu: టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ

Show comments