ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్, లక్ష్మారెడ్డి, మాగంటి గోపినాథ్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి చేశారు.. ఏసీపీ, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తే తమపై కూడా దాడి చేశారని ఆయన అన్నారు.
Read Also: Big Breaking: సీతారాం ఏచూరి కన్నుమూత..
కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ఈ దాడి ఎమ్మెల్యే గాంధీ చేసిన దాడి కాదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడిగా చూస్తున్నామని అన్నారు. తమ ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేశారు.. గాంధీని మాత్రం సెక్యూరిటీతో తీసుకు వచ్చారని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నాం.. డీజీపీ సమాధానం చెప్పాలని కోరారు. పట్టపగలు ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారని.. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతిన్నదని హరీష్ రావు చెప్పారు. ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం.. 9 నెలల్లో 9 కమ్యునల్ ఇన్సిడెంట్ లు జరిగాయని హరీష్ రావు ఆరోపించారు. అనంతరం.. కౌశిక్ రెడ్డి నివాసం నుంచి సైబరాబాద్ సీపీ ఆఫీసుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బయల్దేరింది.
Read Also: Seethakka: మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం..