Site icon NTV Telugu

Ayyanna Patrudu: ఏయూ వీసీ తీరుపై విచారణ జరపాలి

Ayyanna

Ayyanna

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏయూ పరువు పూర్తిగా దిగజారిపోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఏయూ ను వైసీపీ కార్యాలయం గా మార్చేశారు…వీసి ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. ఈనెల 12 వ తేదీన ఏయూ లో గంజాయి పేకెట్లు దొరికాయి.ఏయూ జరుగుతున్న కార్యక్రమాలు పై నేను మాట్లాడితే నాకు ఫోన్లు చేసి బెదిరించారు.విసి ప్రసాద్ రెడ్డి ఫోన్లు చేసి బెదిరించడానికి ఒక బ్యాచ్ ని తయారుచేశారు.ఏయూ ప్రతిష్ట ను దిగజార్చుతుంటే విశ్వవిద్యాలయం లో చదువుకున్న మేధావులు స్పందించాలి.

Read Also: Governor Tamilisai: యాదాద్రి నరసింహ స్వామి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై

జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ రాజకీయాలను ఏయూ నుంచి నడిపారు.విసి ప్రసాద్ రెడ్డి ఉత్తరాంద్ర లో ఉన్న ప్రేవేటు విద్య సంస్థల యజమాన్యాలలతో సమావేశం పెట్టి వైసీపీ ఎమ్మెల్సీ అబ్యర్ధికి ఓటు వేయాలని పెట్టి బెదిరించారు.దీనిపై విసి ప్రసాద్ రెడ్డి పై జిల్లా కలెక్టర్, కేంద్ర,రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాను. నాకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రిప్లై వచ్చింది..రాష్ట్ర ఎన్నికల కమిషన్ , జిల్లా కలెక్టర్ నుంచి రిప్లై రాలేదు. ఏయూ విసి ప్రసాద్ రెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏయూ విసి ప్రసాద్ రెడ్డి ఉండటానికి వీలు లేదు…వెంటనే రీకాల్ చేయాలి. ఏయూ విసి ప్రసాద్ రెడ్డి ప్రవర్తన పై ప్రతిపక్ష పార్టీలు ,ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ స్పందించాలన్నారు అయ్యన్నపాత్రుడు.

Read Also: Chandrababu Naidu: గన్నవరం పాక్ లో ఉందా? ఏమిటీ అరాచకం?

Exit mobile version