Site icon NTV Telugu

Anil Kumar Yadav: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనైతిక పొత్తులకు బుద్ధి చెప్పండి

Anil Kumar

Anil Kumar

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారం ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి ధీటుగా టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పరస్పర సహకారంతో ముందుకెళుతున్నాయి. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తూర్పు రాయలసీమ పట్టభద్రులు ,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై.సి.పి. అభ్యర్థులను ఆశీర్వదించండి. వైసీపీని ఎదుర్కోలేక ఓటమి భయంతో టీడీపీ ,పిడిఎఫ్ లు అనైతిక పొత్తులు పెట్టుకున్నాయి. విశాఖ గ్లోబల్ సమ్మిట్ తో రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు రావటమే సీ.ఎం. జగన్ పనితీరుకు నిదర్శనం అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాదిమందికి ఉపాధి కలగబోతోంది. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ,పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ఘన విజయం సాధించబోతున్నారు. 13 వ తేదీ ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోండి..నెల్లూరులో కొందరు నేతలు నాపై పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాటిని పట్టించుకోను..అలాంటి నేతలు ఏమవుతున్నారో అందరూ చూస్తున్నారన్నారు అనిల్ కుమార్ యాదవ్.

Read Also: Immoral Relationship : మొగుడు బయట.. మరిది లోపల.. కట్ చేస్తే

Exit mobile version