చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుడమేరు, కృష్ణానది వరదలను వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవటానికి చంద్రబాబు ఉపయోగించటం దురదృష్టకరమని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ను 3 బోట్లు ఢీకొన్న ఘటనకు వైసీపీ కుట్ర కారణమని చంద్రబాబు అపవాదు వేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. గతంలో లేనంత వరద వల్ల ఎగువ నుంచి ప్రవాహంతో వందల బోట్లు కొట్టుకు వచ్చాయి.. దిగువకు చిన్న బోట్లు బ్యారేజ్ నుంచి కిందకి కొట్టుకు పోతే, పెద్దగా ఉన్న 3 బోట్లు మాత్రం బ్యారేజ్ దగ్గర చిక్కుకు పోయాయన్నారు. పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేసిన కోమటి రాము.. టీడీపీ ఎన్నారై విభాగానికి చెందిన కోమటి జయరాం బంధువు అని తెలిపారు.
Read Also: Haryana Polls: లాడ్వాలో ముఖ్యమంత్రి సైనీ నామినేషన్.. హాజరైన కేంద్రమంత్రి ఖట్టర్
లోకేష్ తో ఫోటో దిగిన ఉషాద్రి కూడా వైసీపీ నేతగా చెబుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. అలాగే.. నందిగామ సురేష్, తలశిల రఘురాం మీద మళ్ళీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగన్ కు సన్నిహితంగా ఉండే వారిని అరెస్ట్ చేయాలని.. చంద్రబాబు చేసే చౌకబారు ఎత్తుగడలతో మీరే భ్రష్టు పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వరద వస్తుందని ముందే హెచ్చరిక చేయాల్సిన ప్రభుత్వం.. ఆ పని చేయలేదని ఆరోపించారు.
Read Also: Kiren Rijiju: వక్ఫ్ బిల్లుపై ముస్లింలను తప్పుదోవ పట్టించేలా జకీర్ నాయక్ ప్రచారం..
కేంద్రంలో బీజేపీ.. ఏపీలో జనసేన అండగా, చంద్రబాబు ఇలా చేయటానికి ప్రధాన కారణం జగన్ అని అంబటి రాంబాబు తెలిపారు. జగన్ అంటే చంద్రబాబుకు భయం.. ఈ ఎన్నికల్లో గెలుపు తమ సొంత గెలుపు కాదని.. అందరిదీ అనే విషయం చంద్రబాబుకి తెలుసన్నారు. జగన్ వెనుక 40 శాతం ఓటు బ్యాంక్ ఉండటంతో వైసీపీని అణిచివేయాలని చంద్రబాబు ఆలోచన అని పేర్కొన్నారు. పడవలకు వేసే సహజ రంగులను వైసీపీకి ముడి పెడుతున్నారని.. వరదలు వచ్చి 10 రోజులు గడుస్తున్న బాధితులకు సాయం అందటం లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.