NTV Telugu Site icon

Badvel Inter Girl Incident: ప్రేమోన్మాది చేతిలో విద్యార్థిని హత్య.. బాధిత కుటుంబానికి సీఎం భరోసా..

Babu

Babu

Badvel Inter Girl Incident: కడప జిల్లా బద్వేల్‌లో మృతిచెందిన ఇంటర్‌ విద్యార్థిని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. బద్వేల్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో విద్యార్థిని ప్రాణాలు విడిచిన విషయం విదితమే కాగా.. మృతురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం.. ఈ రోజు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయానికి సంబంధించిన రూ.5 లక్షల చెక్కును అందజేశారు కడప జిల్లా ఇంఛార్జ్‌ కలెక్టర్ అతిథి సింగ్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, స్థానిక కూటమి నాయకులు. అయితే.. ఆ కుటుంబానికి మొత్తంగా ఎక్స్‌గ్రేషియా కింద రూ.10 లక్షలు అందించనుంది ప్రభుత్వం..

Read Also: BJP Team: నేడు మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బృందాల పర్యటన..

ఇక, బద్వేల్ లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో ఫోన్ లో మాట్లాడి పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు.. విద్యార్థిని కుటుంబ సభ్యలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.. బాధిత కుటుంబ సభ్యులచే సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి.. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారని.. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని తెలిపారు.. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికం సాయంతో పాటు.. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..