NTV Telugu Site icon

Kiran Kumar Reddy: మంత్రి పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్‌ సంచలన వ్యాఖ్యలు.. బహిరంగ సవాల్..

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. అన్నమయ్య జిల్లాలో కిషోర్ కుమార్ రెడ్డి నామినేషన్ అనంతరం ర్యాలీలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉండగా రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వచ్చి నా కాళ్లు పట్టుకుని బతిమిలాడి నన్ను డీసీసీ అధ్యక్షుడిని చేయాలని కోరారని తెలిపారు.. అంతేకాదు.. మరుసటి ఉదయాన్నే మళ్లీ వచ్చి నేను తాగేసి రాత్రి మీ కాళ్లు పట్టుకొలేదంటూ రెండోసారి మళ్లీ కాళ్లు పట్టుకున్నాడు ఈ పెద్దిరెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, నా కాళ్లు పట్టుకుని అడిగావని నేను కాణిపాకం, తరిగొండ గుడిలో ప్రమాణానికి సిద్ధం..? నువ్వు సిద్ధమా..? అని బహిరంగ సవాల్ విసిరారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్.. మరోవైపు.. పీలేరు అభివృద్ధికి నల్లారి ఫ్యామిలీ వుంటుంది, నన్ను మా తమ్ముడిని ఆదరించి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి.

Read Also: Hyderabad BJP MP Candidate: రాజకీయాల్లో మాత్రమే అవినీతి లేదు.. అంతటా ఉంది..

కాగా, ఈ ఇద్దరు నేతలు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన విషయం విదితమే కాగా.. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటూ ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.. ఇక, పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. ఇప్పుడు పెద్దిరెడ్డికి బహిరంగ సవాల్‌ విసిరారు. మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.