Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి లేఖరాయడం చర్చగా మారింది.. సీఈసీ పర్యవేక్షణలో పుంగనూరు ఎన్నికలు జరపాలంటూ ఆయన ఫిర్యాదు చేశారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలతో ఓటర్లు భయపడుతున్నారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.. మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారాలు ఎన్నికల కమిషన్ ను సవాలు చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వారి కుటుంబీకులు తీవ్రస్థాయిలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు.. పుంగనూరు నియోజక వర్గాన్ని పూర్తిగా కేంద్ర ఎన్నికల కమిషన్ తన ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..
Read Also: Saudi Arab : సౌదీలో పోలీసుల కఠిన చర్యలు.. ఎవరైనా నేరం చేయాలంటే 10సార్లు ఆలోచించాల్సిందే
ఈ ఎన్నికల్లో పుంగనూరులో హింసాత్మక ఘటనలు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ఆకాక్షించిన కిరణ్‌కుమార్.. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్వీయ పర్యవేక్షణలో పుంగనూరు ఎన్నికలు నిర్వహించాలని కోరారు.. గత నెల 14, 15 తేదీల్లో కూడా తాను ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.. ఇక, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం మూలంగా.. మంత్రి పెద్దిరెడ్డి తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ, పోలీస్ అధికారులను ఎన్నికల కంటే ముందుగా నియమించుకున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. వారు ఇప్పుడు వైసీపీకి మద్దతుగా నిలుస్తూ.. విపక్షాలపై దాడులు చేస్తున్నారని.. విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తన లేఖలో పేర్కొన్నారు.. ఇక, నియోజకవర్గం ఓటర్లలో విశ్వాసం పెరగడానికి, స్వేచ్ఛగా ఓటు వేయడానికి, ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి, పుంగనూరు నియోజకవర్గాన్ని పూర్తిగా ఎన్నికల కమిషన్ తన ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఎన్నికల కోసం కేంద్ర పరిశీలకులను ప్రత్యేకంగా నియమించాలి. అన్ని సమస్యాత్మక, కీలకమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు అమర్చాలి. కేంద్ర పారా మిలిటరీ బలగాలను వెంటనే మోహరించాలని తన లేఖ ద్వారా సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి..