NTV Telugu Site icon

Delhi Fire Accident: చాందినీ చౌక్‌లో ‘అంతా బూడిద’.. 50 దుకాణాలు దగ్ధం

Delhi

Delhi

ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 దుకాణాలు ఉన్న రెండు భవనాలు మంటల్లో కాలిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం బూడిదే కనిపిస్తుంది. 12 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అగ్నిప్రమాదంలో ధ్వంసమైన దుకాణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని.. వ్యాపారుల నష్టం కోట్లలో ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.

Italy G7 Summit: పోప్ ఫ్రాన్సిస్‌-మోడీ ఆత్మీయ ఆలింగనం.. వీడియో వైరల్

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాద ఘటనపై ఓ వ్యాపారి మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 4.15 గంటల సమయంలో మంటలు చెలరేగాయని జనాలు కేకలు వేశారన్నాడు. తన దుకాణం ఇరుకైన ప్రదేశంలో ఉందని.. వెంటనే దుకాణంలో ఉన్న వారందరినీ వెళ్లిపోవాలని చెప్పానని తెలిపాడు. అయితే.. కొన్ని నిమిషాల్లోనే దుకాణాలకు మంటలు అంటుకున్నాయని.. అంతా కాలి బూడిదైందని అతను చెప్పాడు. కాలిపోయిన దుకాణాలల్లో చీరలు, దుప్పట్లు, ఇతర వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

RK Roja: అలా అయితే సిగ్గుపడాల.. తలెత్తుకు తిరుగుదాం.. రోజా ఆసక్తికర పోస్ట్

ఈ ఘటనపై.. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ, మంటలు చెలరేగడంతో సహా అనేక దుకాణాలు ఉన్న రెండు భవనాలు కూలిపోయాయన్నారు.మరోవైపు.. నయీ సడక్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దీపక్ మహేంద్రు మాట్లాడుతూ, ఇప్పటివరకు, 50కి పైగా దుకాణాలు దగ్ధమై రూ. 70 నుండి 80 కోట్ల ఉత్పత్తులకు నష్టం వాటిల్లిందని చెప్పారు.
1580 లేదా 1581 షాప్ నంబర్ నుండి మంటలు చెలరేగాయని, కొద్దిసేపటికే మంటలు మొత్తం చుట్టేశాయన్నారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా దుకాణం నుంచి మంటలు చెలరేగాయని.. ఆ మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయని అన్నారు. మంటల తీవ్రతకు రెండు భవనాలు కూలిపోయాయని పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. అనంతరం ఎనిమిది ఫైర్ టెండర్ల సహాయంతో ఘటనా స్థలంలో కూలింగ్ ఆపరేషన్ నిర్వహించారు.