Karimnagar: కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కౌంటింగ్ కోసం కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు వేర్వేరుగా హాల్స్ ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కరీంనగర్ పార్లమెంట్ లో 72.54 శాతం పోలింగ్ నమోదైంది. బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు..మొత్తం 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లు..పోలైన ఓట్లు 13 లక్షల 3 వేల 691 ఓట్లు.. కరీంనగర్ నియోజకవర్గానికి 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మిగిలిన 6 నియోజకవర్గాలకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు అధికారులు. రౌండ్స్ వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. కరీంనగర్ 22, చొప్పదండి 24, వేములవాడ 19, సిరిసిల్ల 21, మానకొండూరు 23, హుజూరాబాద్ 22, హుస్నాబాద్ 22 రౌండ్లవారీగా లెక్కింపు కొనసాగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం కానుంది.
Read also: AP Elections Results 2024: మంగళగిరి ఫలితంపై ఉత్కంఠ.. నారా లోకేశ్ విజయం సాధించేనా?
పోస్టల్ బ్యాలెట్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 9 వేల 287 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. హోం ఓటింగ్ ద్వారా పోలైన ఓట్లు 1560.. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కాగా.. నేటి నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షల కొనసాగింపు, 144 సెక్షన్ అమలు కానుంది. ఒక్కో టేబుల్ కు ముగ్గురు సిబ్బంది చొప్పున ఏర్పాటు చేశారు. 124 మంది కౌంటింగ్ సూపర్ వైజర్స్, 124 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 124 మంది మైక్రో అబ్జర్వర్స్ ఉండనున్నారు. ఒక్కో రౌండ్ ఫలితం వెల్లడి కావడానికి కనీసం అరగంట సమయం పట్టనుంది. మధ్యాహ్నం వరకు విజేత ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక్కో నియోజకవర్గంలో ర్యాండమ్ గా 5 ఈవీఎంలకు సంబంధించిన 5 వీవీ ప్యాట్ల లెక్కింపు చేయనున్న అధికారులు. ఈవీఎంలు, వీవీప్యాట్లలో లెక్క సరిపోతేనే అధికారికంగా అభ్యర్థి ప్రకటన వెలువడనుంది.
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో కౌంటింగ్ కు సర్వం సిద్ధం..